ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొనసాగుతోన్న వరద

ABN, Publish Date - Jun 01 , 2025 | 10:56 PM

కృష్ణా పరి వాహక ప్రాంతం నుంచి వరద నీటి రాక కాస్త తగ్గినప్పటికీ ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 2,231 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి గత మూడు రోజులుగా దిగువకు విడుదల చేసిన వ రద నీరు నేటికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నది.

శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌ వాటర్‌

- డ్యాంలోకి చేరిన 27 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు

దోమలపెంట/ధరూరు/అమరచింత, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా పరి వాహక ప్రాంతం నుంచి వరద నీటి రాక కాస్త తగ్గినప్పటికీ ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 2,231 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి గత మూడు రోజులుగా దిగువకు విడుదల చేసిన వ రద నీరు నేటికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నది. మొత్తంగా 27,203 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరిం ది. ఎంజీకేఎల్‌ఐ కాల్వకు నీటిని త రలింపు నిలిపివే శారు. దీంతో ఆది వారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడగుల కు గాను, 831.10 అడు గులకు చేరగా, 215.807 టీ ఎంసీల సామర్థ్యానికి గాను 50.6888 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అవుతున్నట్లు డ్యాం గేజింగ్‌ అధికారులు పే ర్కొంటున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రా లలో ఉత్పత్తి కొనసాగించడం లేదు.

జూరాలకు తగ్గిన వరద

ప్రియదర్శిని జూరాల ప్రాజె క్టుకు వరద త గ్గుముఖం పట్ట డంతో జెన్‌కో జ ల వి ద్యుత్‌ కేం ద్రంలో ఉత్పత్తి నిలి పి వేశారు. ఆల్మట్టి జ లాశయంలో 52.42 టీఎంసీ లకు నీటి నిల్వ చేరుకోగా, దిగువన ఉన్న నారాయణపూర్‌ జలాశయంలో 25.39 టీఎంసీలకు నీటి నిల్వ చేరకుంది. ప్రస్తుతం జూరాల జలాయశంలో 317.560 మీటర్లలో నీటి నిల్వ ఉండగా ప్రాజెక్టులో 4.052 టీఎం సీలకు నీటి నిల్వ చేరుకుంది. ప్రాజెక్టులో 14 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రానికి నీటి విడుదల ను నిలపి వేయడంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచి పోయింది. దీంతో నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, కుడి కాల్వకు సైతం నీ టి విడు దలను నిలిపి వేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 834 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జూరాల అ ధికారులు తెలిపారు.

- ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం స్వల్పంగా ఇన్‌ఫ్లో నమోదయింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద ప్రవా హం కొనసాగుతున్నది.

Updated Date - Jun 01 , 2025 | 10:56 PM