ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జనగణనతో పాటు కులగణన చరిత్రాత్మకం

ABN, Publish Date - May 02 , 2025 | 11:28 PM

దేశ వ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల యాదయ్య అన్నారు.

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యాదయ్య.

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల యాదయ్య అన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం యావత్‌ దేశ ప్రజలందరు హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ చౌరస్తాలో మోదీ చిత్రపటానికి కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. సీనియర్‌ నాయకులు కుర్వ రాములు, అచ్చుగట్ల అంజయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, రమేష్‌, సుబ్రహ్మాణ్యం, పోతుల రాజేందర్‌రెడ్డి, రాజేష్‌, మడుగు శివశంకర్‌, మల్లేష్‌, నాగభూషణం, బాలగోపి, నరసింహ, నాగరాజు, రాజు, దాసు, యాదయ్య, వెంకటయ్య, భానుప్రసాద్‌, వీరయ్య పాల్గొన్నారు.

బీసీ కులగణన హర్షనీయం

జడ్చర్ల : దేశ జనాభాతో పాటు బీసీ కులగణన చేపడతామని ప్రకటించడం హర్షనీయం అని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్‌ అన్నారు. జడ్చర్ల మండల విద్యావనరుల కేంద్రం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన బీసీ జాగృతి సేన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య కృషి, పోరాటం ఉందన్నారు. కులగణన చేపట్టిన అనంతరం పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, జనాభా దామాషా నిష్పత్తితో చట్టసభలలో, ప్రభుత్వ రంగ సంస్థలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ జాగృతి సేన సభ్యులు నిరంజన్‌, విజయ్‌కుమార్‌, లింగంపేట శేఖర్‌, గోపాల్‌, శివశంకర్‌, చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:28 PM