ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్ని శాఖలు సమన్వయంతో ఉండాలి

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:29 PM

జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, అన్ని శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్య లు చేపట్టాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అఽధికారులను ఆదేశించారు.

  • కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • విపత్తు నిర్వహణ యాక్షన్‌ప్లాన్‌పై అధికారులతో సమావేశం

గద్వాల న్యూటౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, అన్ని శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్య లు చేపట్టాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అఽధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీ స మావేశపు హాలులో విపత్తు నిర్వహణ యాక్షన్‌ప్లాన్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తులు సంభవించిన తర్వాత స్పం దించేది కాకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులకు మధ్యలో గద్వాల జిల్లా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 10 సంవత్సరాలలో ఎలాంటి విపత్తులు సంభవించలేదని, 2009లో వరదలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగిందన్నారు. ఇతర సమస్యలు తలెత్తలేదన్నా రు. ఈసారి జిల్లాలో ముందస్తుగా జూన్‌ నుంచి వర్షాలు కురుస్తున్నందున అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. విపత్తులు రాకముందే ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాస్థా యి మాదిరిగా అన్ని మండలాలు, గ్రామస్థాయిలో కమిటీలను తహసీల్దార్‌ అధ్యక్షతన ఏర్పాట్లు చేసుకొని సమావేశాలు నిర్వహించుకోవాలన్నా రు. అదనపు కలెక్టర్‌ను విపత్తుల జిల్లా నోడల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు. తహసీ ల్దార్లు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి సమర్థవంతమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నదీ పరివాహన ప్రాంతాల్లోని గ్రా మాలకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను, పాఠశాలలను ముందస్తుగానే గుర్తించి అవరమైతే వారిని ఇతర ప్రాం తాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నా రు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విపత్తు నిర్వహణ చట్టం- 2025 ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. జిల్లాలో భౌగోలికంగా ఎక్కడా ఎలాంటి పరిశ్రమలు లేవని, మా రుతున్న వాతావరణానికి అనుకూలంగా వర్షాల వల్ల విపత్తులు సంభవించే అవకాశం ఉన్నదన్నారు. భారీవర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న గృహాలు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకా శం ఉందన్నారు. ఇందుకు జిల్లా, మండలస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏ ర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌, ఫైర్‌, ఎలక్ట్రిసిటీ అధి కారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు, సంబంధిత శాఖాధికారులు ఉన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:29 PM