ఏడీజే కోర్టులు ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:32 PM
నారాయణపేట బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం హైకోర్టు, పోర్ట్ పోలియో న్యాయాధికారి మధుసూదన్ రావును కలిశారు.
- హైకోర్టు న్యాయాధికారిని కలిసిన పేట బార్ అసోసియేషన్ సభ్యులు
నారాయణపేట న్యూటౌన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం హైకోర్టు, పోర్ట్ పోలియో న్యాయాధికారి మధుసూదన్ రావును కలిశారు. ఈ సందర్భంగా వారు నారాయణపేట కోర్టులో ఎస్సీ, ఎస్టీ విని యోగదారుల ఏడీజే కోర్టులు రావల్సి ఉందని, వాటిని ఏ ర్పాటు చేయాలని కోరారు. సభ్యుల వినతికి న్యాయాధికారి సానుకూలంగా స్పందించారు. న్యాయాధికారిని కలిసిన వారిలో పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీ అమి రుద్దీన్ ఉన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:32 PM