ట్రాన్స్‌పోర్టు సమస్య తలెత్తితే చర్యలు
ABN, Publish Date - May 14 , 2025 | 10:50 PM
కొనుగో లు కేంద్రాల వద్ద ట్రాన్స్‌ఫోర్టు సమస్య తలెత్తితే సంబంధిత గుత్తేదారులపై చర్యలు తీసుకుంటా మని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు అన్నారు.
- ఆత్మకూరులో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలు
- జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ఆత్మకూరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : కొనుగో లు కేంద్రాల వద్ద ట్రాన్స్‌ఫోర్టు సమస్య తలెత్తితే సంబంధిత గుత్తేదారులపై చర్యలు తీసుకుంటా మని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటాలు చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ధా న్యాన్ని తీసుకువెళ్లేందుకు లారీల కొరత ఏర్పడిం దని రైతులు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఆయన ఆరేపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. సంబంధిత ట్రాన్స్‌ఫోర్టు గుత్తేదారు లు కొనుగోలు కేంద్రాలకు సరిపడే లారీలు డీసీ ఎంలను ఏర్పాటు చేశాం కానీ, రైస్ మిల్లుల వ ద్ద అన్‌లోడింగ్ కాస్త లేటు అవ్వడంతో కొనుగో లు కేంద్రాల వద్ద రైతులు, నిర్వాహకులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ట్రాన్స్‌ఫోర్టు అధికా రులు కలెక్టర్‌కు తెలిపారు. దీంతో ఆయన స్పం దించి ఆత్మకూరు, అ మరచింత కొనుగోలు కేంద్రాల వద్దకు అద నంగా మరో నాలు గు లారీలను అందు బాటులో ఉంచాలని గుత్తేదారులకు ఆదే శించారు. అనంత రం పట్టణ కేంద్రం లోని శ్రీలక్ష్మి ఆగ్రోటె క్ ఇండస్ర్టీస్‌ను పరి శీలించి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా అన్‌లోడ్ చే సి పంపితే సౌకర్యంగా ఉంటుందని, అందుకు సరిపడా హమాలీలను అదనంగా ఏర్పాటు చే సుకోవాలని సూచించారు. ధాన్యంలో ఎక్కువగా తాలు ఉన్నాయని సాకుతో తూకంలో అదనంగా కోతలు విధించరాదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం తాలు గుర్తించిన అనంతర మే ధాన్యం కొనుగోలు చేస్తార ని తెలిపారు. అ దేవిధంగా రానున్న రెండు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురు స్తుందని వాతా వరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తమ ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకునేలా మండల అధికారులు కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు రైతులకు తెలియజేయా లని ఆదేశించారు. ఆత్మకూరు తహసీల్దార్ చాం ద్‌పాషా, శ్రీలక్ష్మి ఆగ్రోటెక్ యజమాని పులిమా మిడి రమేష్ శెట్టి, ట్రాన్స్‌ఫోర్టు గుత్తేదారు నీలేష్ శెట్టితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 10:50 PM