ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

ABN, Publish Date - May 26 , 2025 | 11:41 PM

నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నా రు.

మాట్లాడుతున్న నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

-నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నా రు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన నకిలీ పత్తి విత్తనాల నియంత్ర ణపై పోలీస్‌, వ్యవసాయశాఖ అధికా రులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సు టీమ్‌ల సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేని బీటీ-3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్‌, వ్యవ సాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సు టీంలు విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. జూన్‌ నెల కంటే ముందుగానే వర్షాలు పడుతు న్నందున వ్యవసాయ పనులు జోరందుకున్నాయని తెలిపారు. జిల్లాలో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తారని, నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యా ప్తంగా 2.86లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధి కారులు అంచనా వేసినట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు 2,865 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 573 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని బీటీ-3 నకిలీ పత్తి విత్తనాలు వంటివి అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మ డం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, పీడీ యాక్ట్‌ నమోదుతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల్లో కూడా నిఘా ఉంచాలన్నారు. కార్య క్రమంలో అడిషనల్‌ ఎస్పీ రామేశ్వర్‌, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌, మండల వ్యవసాయ అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:41 PM