ప్రైవేటు ఆసుపత్రిలో మహిళ మృతి
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:35 PM
జిల్లా కేం ద్రంలోని యునైటెడ్ అనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం అర్థఽరాత్రి చికిత్స పొందుతూ ఓ గిరిజన మహిళ మృతి చెందారు.
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
- డాక్టర్‌పై దాడికి నిరసనగా ప్రైవేటు ఆసుపత్రులు బంద్
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), జూలై 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేం ద్రంలోని యునైటెడ్ అనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం అర్థఽరాత్రి చికిత్స పొందుతూ ఓ గిరిజన మహిళ మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో నే చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. ఇదే క్రమంలో డాక్టర్‌పై దాడిచేశారంటూ ప్రైవేటు డాక్టర్లు కూడా మంగళవారం ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేశారు. మృతురాలి కొడుకు శంకర్ కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన నేనావత్ దేవమ్మ (63) అనే మహిళకు అనారోగ్యం కారణంగా ఈనెల 13న జిల్లా కేంద్రంలోని శెట్టి కాంప్లెక్స్‌లో యునైటెడ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కించాలని చెప్పడంతో రక్తం తెచ్చి ఇచ్చారు. రక్తం ఎక్కించిన మరుసటి రోజు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ తల్లి చనిపోయిందని న్యాయం జరిగే వరకు శవాన్ని ఇక్కడే ఉం చుతామని బైఠాయించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యంతో పాటు ఐఎంఏ యూనియన్ డాక్టర్లు వచ్చి కులం పేరుతో దూషించడమే కాకుండా నానా దుర్భాషలాడారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతికి కారణమైన డాక్టర్‌పై చర్యలు తీసు కోవాలని, ఆసుపత్రి అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు ఆసుపత్రికి వచ్చి నచ్చజెప్పి శవాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా అనారోగ్య సమస్యల వల్లనే ఆమె చనిపోయిందని, ఇందులో మా నిర్లక్ష్యం లేదని ఆసుపత్రి యాజమాన్యాలు అంటున్నాయి. తమపై దాడి చేశారంటూ ఐఎంఏ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా డాక్టర్లపై దాడికి నిరసనగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అన్ని సేవలు బంద్ చేయించారు.
Updated Date - Jul 15 , 2025 | 11:35 PM