ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:32 PM

డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ను సోమవారం డీకే బం గ్లాలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

గద్వాల, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ను సోమవారం డీకే బం గ్లాలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్‌ 370ని వెంటనే రద్దు చేయాలనే ఉద్యమ క్రమంలో 1953, జూన్‌ 23న బలిదానం కావడం జరిగిందన్నారు. ఆయన ఆశయాన్ని ప్రధాని మోదీ 370 ఆర్టికల్‌ను రద్దు చేసి పూర్తిచేశాడని అన్నారు. ప్రధాని పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ పోలింగ్‌ బూత్‌ పరిధిలో 11 మొక్కలు నాటడం జరిగిందని డీకే బంగ్లాలో మొక్కలు నాటడం ద్వారా దీనిని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధా న కార్యదర్శి రవికుమార్‌ ఎగ్బోటే, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, జిల్లా ఉపాఽధ్యక్షులు రజక నర్సింహులు, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, ఓబీసీ అధ్యక్షుడు దేవదాసు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌, ఐటీసెల్‌ కన్వీనర్‌ చిత్తారి కిరణ్‌, గద్వాల మండల అధ్యక్షుడు శ్రీనివాసు లు, నాయకులు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:32 PM