దేశంలో పేదల కోసం అవిశ్రాంత పోరాటం
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:39 PM
వంద ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల సీపీఐ దేశంలో పేదలు, రైతుల పక్షాన నిలబడి వారి కోసం ఆవిశ్రాంత పోరాటాలు సాగించిందని సీపీఐ జాతీయ నా యకురాలు సురవరం విజయలక్ష్మి అన్నారు.
సీపీఐ జాతీయ నాయకురాలు సురవరం విజయలక్ష్మి
ఉండవల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వంద ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల సీపీఐ దేశంలో పేదలు, రైతుల పక్షాన నిలబడి వారి కోసం ఆవిశ్రాంత పోరాటాలు సాగించిందని సీపీఐ జాతీయ నా యకురాలు సురవరం విజయలక్ష్మి అన్నారు. ఈ క్రమంలో ఎన్నో ఉద్యమాలు చేసి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తుందని తె లిపారు. ఆదివారం ఉండవల్లి మండలం కం చుపాడులో సురవరం విజ్ఞాన కేంద్రంలో రవి అధ్యక్షతన జరిగిన మహాసభకు ఆమె ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె సురవరం కపిల్, జిల్లా కార్యదర్శి ఆంజనేయుల తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అ నంతరం సురవరం విజయలక్ష్మి మాట్లాడుతూ దున్నే వాడికే భూమి కావాలని మొట్టమొదట నినదించిన పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. ఆ దిశగా పేదల పక్షాన పోరాటాలు సాగిస్తు వారికి అండగా నిలబడిందన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి పోరాడితే సమస్యలు పరిష్కా రమవుతాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆం జనేయులు మాట్లాడుతూ జిల్లాలో అధికారు లు సమస్యలను పరిష్కడంలో విఫలమయ్యార న్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆగస్టు 4న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా మహాస భలను విజయవంతం చేయాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారు లకు, పెత్తందారులకు అనుకూలంగా చట్టాలను రూపొందించడం సరైంది కాదన్నారు. మతం ముసుగులో ప్రజల మధ్య విద్వేషాలను పెంచు తూ వారి మనోభావాలను దెబ్బతీస్తుందని వి మర్శించారు. అనంతరం ఉండవల్లి మండల నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా నాగార్జున, సహాయ కార్యదర్శులుగా రవి, వి.రామకృష్ణ, కమిటీ సభ్యులుగా సుభాన్, మహేష్‌ను ఎన్నుకున్నారు.
Updated Date - Jul 14 , 2025 | 05:39 AM