సైనికులకు శతకోటి వందనాలు
ABN, Publish Date - May 19 , 2025 | 11:21 PM
ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న దేశ సైనికులకు శతకోటి వందనాలు అని అయిజ మండల బీజేపీ, అఖిలపక్షం నాయకులు అన్నారు.
అయిజలో తిరంగా ర్యాలీ చేస్తున్న బీజేపీ, అఖిలపక్షం నాయకులు
- అయిజలో తిరంగా ర్యాలీకి భారీ స్పందన
అయిజ టౌన్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న దేశ సైనికులకు శతకోటి వందనాలు అని అయిజ మండల బీజేపీ, అఖిలపక్షం నాయకులు అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మతం ముసుగులో కొందరు చేస్తున్న ఉగ్ర కార్యకలాపాలను దేశ ప్రజలు సహించ బోరని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు, అఖిలపక్షం కమిటీ, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 11:21 PM