వైద్య విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:20 PM
వైద్య విద్యార్థులకు మంచి వాతావరణం క ల్పించాలని కలెక్టర్ బ దావత్ సంతోష్ అన్నా రు.
- కలెక్టర్ సంతోష్
నాగర్‌కర్నూల్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థులకు మంచి వాతావరణం క ల్పించాలని కలెక్టర్ బ దావత్ సంతోష్ అన్నారు. నాగర్‌కర్నూల్ జి ల్లా కేంద్రంలోని ప్రభు త్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్ర భుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులపై స మగ్ర సమీక్ష నిర్వహించారు. తనిఖీ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యా పక సిబ్బందితో కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకు న్నారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ కళాశాల తరగతి గదులు, ప్రయో గశాలలు, హాస్టల్ గదులు, వసతి సముదాయాలు, భోజన శాల వంటి భాగాలను పరిశీ లించారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై ఆయన ప్రిన్సిపాల్‌తో చర్చించారు. కళాశాల పరిసరాల్లో శుభ్రత, నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, కళాశాలలో విద్యార్థుల వసతి, భద్రత, చదువుకు అవసరమైన ఆధునిక ల్యాబ్ పరికరాలు గ్రంథాలయ వసతులు వంటి అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల అదనపు భవనాలు, హాస్టల్ సముదా యాల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, వైద్య కళాశాల అ ధ్యాపకులు తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:20 PM