ప్రజా సంక్షేమానికి పెద్దపీట
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:18 PM
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
హన్వాడ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, మునిమోక్షం, తిరుమలగిరి, పెద్దదర్పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి, మాట్లాడారు. ఇళ్లు లేని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. అనంతరం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసిడింగ్‌లు ఇచ్చారు. కొత్తపేటలో గ్రామ స్వరాజ్య సంస్థ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టుమిషన్ శిక్షణను ప్రారంభించి, సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు అందించారు. టంకర రైతు వేదికలో పలువురు రైతులకు విత్తనాలను అందించారు. దొరితండా గ్రామ పంఆయతీ పల్గుతండాకు చెందిన లక్ష్మన్‌నాయక్, ఇబ్రహింబాద్ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి ఇటీవత మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మన్‌యాదవ్, మండల అధ్యక్షుడు మహేందర్, నాయకులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేష్, సిరాజ్‌ఖాద్రి, సుధాకర్‌రెడ్డి, నాయకులు కృష్ణయ్య, చెన్నయ్య, యాదయ్యయాదవ్, కలీం, నవనీత, గంగిరెడ్డి, లింగంనాయక్, షబ్బీర్, సుఽధాకర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 11:18 PM