ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

32 అద్దె దుకాణాల సీజ్‌

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:32 PM

నగరపాలక సంస్థ అద్దె దుకాణాల బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేషన్‌ అధికారులు కొరడా ఝుళిపించారు.

క్లాక్‌టవర్‌లో దుకాణ సముదాయాలను సీజ్‌ చేస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

- వీటిపై రూ. 6 కోట్ల బకాయి

- వెలవెలబోతున్న క్లాక్‌టవర్‌ చౌరస్తా

మహబూబ్‌నగర్‌, జూలై 24 (ఆంధజ్యోతి) : నగరపాలక సంస్థ అద్దె దుకాణాల బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేషన్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని గడియారం చౌరస్తాలోని 32 దుకాణాలను గురువారం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ దుకాణాలపై కొన్నే ళ్లుగా రూ.6 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులు నో టీసులు జారీ చేసినా బకాయిలు వసూలు కావడం లేదు. 3 నెలల క్రితం ఇ దే తరహాలో దుకాణాలను సీజ్‌ చేశారు. ఆ సమయంలో వ్యాపారులు అధికార పార్టీ నాయకులతో పైరవీలు చేసి బకాయి మొత్తంలో 5శాతం చెల్లించి దుకాణాలను తెరిపించుకున్నారు. మూ డు నెలల్లో మొత్తం బకాయిలను క్లియర్‌ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు కొందరు 10 శాతం, మరికొందరు 15 శాతం వరకు అద్దెలు చెల్లించారు. ఆశించిన స్థాయిలో బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు దుకాణాలను సీజ్‌ చేశారు. 100 శాతం చెల్లించిన తర్వాతనే దుకాణాలను తిరిగి ఓపెన్‌ చేయడం జరుగుతుందని అధికారులు చెబుతు న్నారు. కాగా గడియారం చౌరస్తాలో దుకాణాలన్నీ మూతపడ డంతో చౌర స్తా వెలవెలబోతున్నది.

Updated Date - Jul 24 , 2025 | 11:32 PM