ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విలీన ప్రాంతాలకు మహర్దశ

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:57 AM

గత ప్రభు త్వ హయాంలో నల్లగొండ మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు ఆ తర్వాత వార్డులుగా రూపాంత రం చెందాయి.

12వ వార్డులో పూర్తి అయిన సీసీ రోడ్డు నిర్మాణం

విలీన ప్రాంతాలకు మహర్దశ

రూ. 53 కోట్లతో సీసీరోడ్లు, ఓపెన డ్రైనేజీ

ఇప్పటికే 60శాతంకు పైగా నిర్మాణాలు పూర్తి

నల్లగొండ మునిసిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభు త్వ హయాంలో నల్లగొండ మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు ఆ తర్వాత వార్డులుగా రూపాంత రం చెందాయి. అయితే అప్పటి ప్రభుత్వం ఆయా గ్రామాలను విలీనం చేసినా అభివృద్ధి మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మునిసిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. నల్లగొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులతో పాటు రోడ్ల నిర్మాణం వల్ల రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతో విలీనమైన ప్రాం తాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా రు. ఇందులో ముఖ్యంగా సీసీ రోడ్లతో పాటు ఓపెన డ్రైనేజీలకు నిధులను విడుదల చేశారు. దీంతో నల్లగొండ మునిసిపాలిటీ పరిధిలో విలీనమైన మర్రిగూడ, చర్లపల్లి, ఆర్జాలబావి, కతాల్‌గూడెం, కేశరాజుపల్లి, శేషమ్మగూడెంతో పాటు 18,19వ వార్డులు, హౌజింగ్‌ బోర్డు కాలనీ, చింతబాయిగూడెం, లెప్రసీ కాలనీలో ముమ్మరంగా రోడ్ల నిర్మాణాలతో పాటు ఓపెన డ్రైనేజీ పనులు సాగుతున్నాయి.

రూ. 53 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, ఓపెన డ్రైనేజీ

నల్లగొండ మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాల కు పీయూఎ్‌ఫఐడీసీ కింద రూ.53 కోట్లను విడుదల చేయడంతో పాటు 60 కిలోమీటర్ల సీసీ రోడ్లను, టఫ్‌ ఐడీసీ కింద 38 కిలోమీటర్ల ఓపెన డ్రైనేజీను చేపట్టారు. ఇప్పటికే 60 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ఈ నిధులతోనే 18, 19వ వార్డుల్లో కూడా సీసీ రోడ్లను చేపట్టారు. కొద్దిపాటి వర్షం వచ్చి న నల్లరేగడి మట్టిలో నడవడానికి ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆ రెండు వార్డులలోనూ సీసీ రోడ్లు పనులు ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలో విలీనమైన గ్రామాల్లో రోడ్లు, ఓపెన డ్రైనేజీ పనులను ముమ్మరంగా పూర్తి చేసేలా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డికి సూచనలు చేశారు. అదేవిధంగా నాణ్యత విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడటంతో పాటు త్వరితగతిన రోడ్లను, ఓపెన డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నల్లగొండ పట్టణంలోని వార్డుల్లో విలీనమైన ప్రాంతాలతో రోడ్ల ను పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 40 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరో నెల రోజుల్లో విలీనమైన గ్రామాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు ఓపెన డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు.

త్వరలోనే పట్టణంలోని మిగతా ప్రాంతాల్లో....

నల్లగొండ మునిసిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల్లో సీసీ రోడ్లు, ఓపెన డ్రైనేజీ పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి వెంకట్‌రెడ్డి త్వరలోనే నల్లగొండ పట్టణంలోని మిగతా వా ర్డులకు కూడా సీసీరోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూ చించారు. ప్రత్యేకంగా నిధులను కేటాయించి టెం డర్లను కూడా ఆహ్వానించనున్నారు. శివారు ప్రాం తాల్లో ప్రస్తుతం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపట్టారు. ఈ డ్రైనేజీ పనులు పూర్తయిన వెంటనే సీసీరోడ్లను వేయనున్నారు. డ్రైనేజీ వేయకుండా సీసీ రోడ్లను వేస్తే మళ్లీ తవ్వకాలు జరిపితే రోడ్లు దెబ్బతినే అవకాశం ఉండటంతో ముందుగా యూ జీడీ పనులను పూర్తి చేసి ఆ తర్వాత సీసీ రోడ్లకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇందుకోసం నల్లగొండ మునిసిపల్‌ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వార్డులు, కాలనీల వారీగా ప్రజల అవసరాలను కాలనీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

రోడ్ల నిర్మాణంతో కాలనీల అభివృద్ధి

ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో నల్లగొండ పట్టణంలోని 19వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణా లు మొదలయ్యాయి.మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో తమ వార్డులో డ్రైనేజీ నిర్మాణంతో పాటు సీసీరోడ్ల నిర్మా ణం ప్రారంభించారు. అదేవిధంగా నీటి సమ స్య పరిష్కారం కోసం ట్యాంకు నిర్మాణం చేపట్టడం జరిగింది.మరో ఆరునెలల్లో వార్డులోఅభివృద్ధి పను లు పూర్తవుతాయి. రోడ్ల నిర్మాణాలు పూర్తయితే కాలనీలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి.

గోగుల గణేష్‌, శ్రీనగర్‌ కాలనీ, నల్లగొండ

60 శాతం రోడ్ల నిర్మాణం పూర్తి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలతో నల్లగొండ ము నిసిపాలిటీలో విలీమైన గ్రామా ల్లో ఇప్పటికే 60 శాతానికి పైగా సీసీ రోడ్ల నిర్మాణం, ఓపెన డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో మిగతా రోడ్ల నిర్మాణాలు, ఓపెన డ్రైనేజీ పూర్తవుతాయి. రోడ్లు, ఓపెన డ్రైనేజీ పనులను నాణ్యతతో నిర్మాణాలు చేపడుతున్నాం. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే మి గతా నిధులతో అభివృద్ధి పనులను చేపడుతాం.

సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌, నల్లగొండ

Updated Date - Apr 30 , 2025 | 12:57 AM