ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీ.వెల్లెంలలో మహా శివలింగం స్థల వివాదం

ABN, Publish Date - May 13 , 2025 | 12:10 AM

భారీ పరిమాణంలో ఏళ్ల తరబడి పూజలకు నోచుకోకుండా ఉన్న ఓ శివలింగానికి గ్రామస్థులు గుడి కట్టాలని సంకల్పించారు.

బీ.వెల్లెంలలో మహా శివలింగం స్థల వివాదం

జలాభిషేకానికి గ్రామస్థుల యత్నం

స్థలం నాదేనంటూ రైతు అభ్యంతరం

నార్కట్‌పల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): భారీ పరిమాణంలో ఏళ్ల తరబడి పూజలకు నోచుకోకుండా ఉన్న ఓ శివలింగానికి గ్రామస్థులు గుడి కట్టాలని సంకల్పించారు. సోమవారం ఆ శివలింగానికి జలాభిషేకం చేయాలని ప్రయత్నించారు. శివలింగం పడి ఉన్న స్థలం తనదని, ఆ స్థలంలో గుడి ఎలా కడతారని ఓ రైతు అభ్యంతరం తెలిపాడు. స్థలం ప్రభుత్వానిదేనని గ్రామస్థులు వాదిస్తున్నారు. విచారణ చేయాలని గ్రామస్థులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నార్కట్‌పల్లి మండలంలోని బీ.వెల్లెంల మధిర గ్రామమైన కొత్తగూడం శివారులో జరిగింది. గ్రామంలోని 170 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్‌లో 1.34 గుంటల విస్తీర్ణంలో శివలింగానికి గుడి భూమి ఉండాల్సి ఉంది. ఈ సర్వే నెంబర్‌లో కొంత మేర బండ వ్యాపించి ఉంది. ఈ బండపైనే భారీ పరిమాణంలో ఉన్న శివలింగానికి గుడి కట్టాలని గ్రామస్థులు కొందరు సంకల్పించారు. ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న పట్టాభూమికి చెందిన కొందరు రైతులు సర్వే నెంబర్‌ 170లోని మహాశివలింగం ఉన్న బండ భూమిని ఆక్రమించారు. గ్రామస్థులు గుడి కట్టేందుకు పరిశీలించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని తమదని అభ్యంతరం చెప్పారు. దీంతో సోమవారం జలాభిషేకం ఏర్పాట్లు చేయగా స్థల వివాదంతో రద్దు చేసుకున్నారు. ఈ స్థలంపై విచారణ చేసి గుడి కట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గ్రామస్థులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, ఎన.కృష్ణ, కోటేశ, రాములు, నవీన, ధర్మారెడ్డి, వెంకన్న, యాదగిరి, నగేశ, అశోక్‌ ఉన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:10 AM