ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- బాల కార్మికులకు విముక్తి

ABN, Publish Date - Jul 06 , 2025 | 10:33 PM

ప్రాథమిక వి ద్య బాల్యానికి పునాది. అది బలంగా ఉంటేనే భవిష్య త్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలపం పట్టాల్సిన చిన్నారులతో పనులు చేయిస్తున్నారు. పనుల నుంచి బాలలలకు విముక్తి కల్పించేలా ఏటా ప్రభుత్వం జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది.

లోగో

- ప్రత్యేక బృందాలతో తనిఖీలు

- ఏటా రెండు సార్లు అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

ఆసిఫాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వి ద్య బాల్యానికి పునాది. అది బలంగా ఉంటేనే భవిష్య త్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలపం పట్టాల్సిన చిన్నారులతో పనులు చేయిస్తున్నారు. పనుల నుంచి బాలలలకు విముక్తి కల్పించేలా ఏటా ప్రభుత్వం జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. జిల్లాలో మంగళవారం నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.

- శాఖల అధికారులతో బృందం

మహిళ శిశు సంక్షేమ శాఖ (బాలల పరిరక్షణ విభా గం), పోలీసు, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వ ర్యంలో ఉద్యోగులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బడి మానేసి పను లు చేస్తున్న చిన్నారులను గుర్తిస్తారు. బస్టాండు,రైల్వే స్టేషన్లు, హోటళ్లు, దుకాణాలు, ఆటోమొ బైళ్లు, ఇటుక బట్టీలు, మెకానిక్‌ షెడ్లు, వ్యవసాయ క్షేత్రాల్లో, ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో పనులు చేస్తున్న బాలలను తనిఖీలు నిర్వహించి గుర్తిస్తారు. వారిని రక్షించడం తోపాటు పనిలో పెట్టుకున్న యాజ మాన్యంపై చర్యలు తీసుకుంటారు. బాలల తల్లిదండ్రు లకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. వారు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే ప్రభుత్వ వసతి గృహల్లో చేర్పిస్తారు.

- జిల్లాలో 2017 నుంచి..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2017 నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మొట్ట మొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌ పేరుతో , జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా 2016 అక్టోబర్‌ 11న కుమరం బీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడింది. దీంతో 2017 జనవరి నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ఏడాది జూలై 1 నుంచి 31 వరకు 11వ విడత ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని అధికా రులు నిర్వహిస్తున్నారు. 2017నుంచి ఇప్పటివరకు. ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో మొత్తం జిల్లాలో 1,114 బాలబాలికలను అధికారులు గుర్తించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే బాల కార్మిక నిరోధక చట్టం కింద యజమానులకు రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సంవత్సరం ఆపరేషన్‌ స్మైల్‌లో ఆపరేషన్‌ ముస్కాన్‌లో

గుర్తించిన బాలలు గుర్తించిన బాలలు

2017 67 25

2018 47 31

2019 66 63

2020 106 ---

2021 157 140

2022 101 52

2023 43 30

2024 68 61

2025 57 ----

బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దు..

- మహేష్‌, జిల్లా బాలల సంరక్షణాధికారి

ఎట్టి పరిస్థితుల్లోను బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదు. పనిలో పెట్టుకున్నట్లయితే యజమా నులపై క్రిమినల్‌ కేసులు నమోదవుతాయి. తల్లిదండ్రు లు సైతం బాల బాలికలను పాఠశాలలకు పంపించాలి. బాల్యాన్ని బందీ చేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తం గా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతాం.

Updated Date - Jul 06 , 2025 | 10:33 PM