ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

ABN, Publish Date - May 15 , 2025 | 11:12 PM

ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు అన్నారు.

కొల్లాపూర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావును సన్మానిస్తున్న ఆ పార్టీ నాయకులు, చిత్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు

కొల్లాపూర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడి గా ఎన్నికైన తరువాతన తొలిసారి కొల్లాపూర్‌ ప ట్టణానికి విచ్చేసిన వేముల నరేందర్‌రావును జిల్లా మాజీ అధ్యక్షుడు, కొల్లాపూర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌ రావు ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడు తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలోనే దేశ ప్రజలకు భద్రత ఉందని పేర్కొన్నారు. రా ష్ట్రంలో రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడానికి ప్రతీ ఒక్క రు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 17 నుంచి దేశవ్యాప్తంగా దేశ సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా అమరు లైన ఆర్మీ జవాన్‌లను స్మరిస్తూ తిరంగ్‌ యాత్ర ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈనెల 20, 21 తేదీలలో జిల్లా కేంద్రాలలో 23 వరకు ముని సిపల్‌ కేంద్రాల్లో తిరంగ్‌ యాత్ర ఘనంగా నిర్వ హించాలని సూచించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1200 కోట్లతో త్వరలోనే సోమశిల కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన పనులు ప్రారంభమవుతాయని పేర్కొ న్నారు. కాంగ్రెస్‌ పార్టీ కల్లబొల్లి మాటలతో గద్దెనె క్కి కొల్లాపూర్‌ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవాచేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తమటం శేఖర్‌గౌడ్‌, జిల్లా ఉ పాధ్యక్షుడు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు క డ్తాల కృష్ణ, సందు రమేష్‌, జిల్లా నాయకులు త మటం సాయికృష్ణగౌడ్‌, మండల అధ్యక్షులు కే తూరి నారాయణ, పట్టణ అధ్యక్షులు కాడం శ్రీని వాసులు, యువజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌ చంద్ర, పాన్‌గల్‌ మండల అధ్యక్షు లు అన్వేష్‌, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు పదిర భీమేష్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:12 PM