రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివెళ్దాం
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:50 PM
రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివెళ్దాంLet's move in millions to the Silver Jubilee Celebration
- మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్
కల్వకుర్తి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : cమంగళవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ నియోజక వర్గం లోని 166 గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవ వాల్‌ప్టోర్లను ఆవిష్కరించామని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లు, పల్లెల్లో రజతోత్సవ సభ విజ యవంతం చేయాలని విస్తృతంగా వాల్ రైటింగ్ ప్రచారం చేశామని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాల ఆవిష్కరణ పండుగ వాతావరణంలో జరపాలని ఆయన పిలుపుని చ్చారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల నుంచి ఈ నెల 27న ఉదయం 8గంటలకు కడ్తాల మండల కేంద్రానికి చేరుకోవాలని ఆయ న సూచించారు. నియోజకవర్గానికి 35బస్సు లను ఏర్పాటు చేశామని బస్సులతోపాటు సొం త వాహనాల్లో సభకు తరలి రావాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Updated Date - Apr 22 , 2025 | 11:50 PM