రాష్ట్రం లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామప క్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:39 AM
రాష్ట్రం లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామప క్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
రాష్ట్రం లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామప క్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ నెల 23న విద్యాసంస్థల బంద్
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
నల్లగొండరూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామప క్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్, ఏఐఎ్‌ఫడీఎస్ నాయకులు తె లిపారు. పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో గురువా రం పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్, ఏఐఎ్‌ఫడీఎస్, పీవైఎల్, డీవైఎ్‌ఫఐ సంఘాల ఆధ్వర్యంలో స మావేశంల నిర్వహించారు. అనంతరం ఆయా విద్యా ర్థి సంఘాల నాయకులు ఇందూరు సాగర్, ఖమ్మంపాటి శంకర్, ముదిగొండ మురళీకృష్ణ, పోలే పవన, మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి పెనం లోంచి పొయ్యులో పడ్డ చందంగా మారిందని ఎద్దేవా చేశారు. అనేక త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత వి ద్యభారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమి, మరోవై పు ప్రైవేట్ విద్యాసంస్థల విచ్చలవిడిగా ఫీజుల దోపిడీతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నార ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అ న్ని రకాల పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో అందించాలని, బట్టలు, చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు, నోట్ బు క్స్ వెంటనే అందించాలని, శిథిలావస్థకు చేరిన బిల్డింగులను తొలగించి నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక, ఉపాధ్యాయ, నానటీ చింగ్ పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కోరారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచే యాలని, అనుమతి లేని ప్రైవేట్ కళాశాలల గు ర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8వేల కోట్ల రీయిం బర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చే యాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని వా రు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎ్‌సఎఫ్ జిల్లా అ ధ్యక్షుడు ఎన్నిమల్ల ఆంజనేయులు, సూర్య తేజ, పీడీఎ్‌సయూ నాయకులు ఎండీ సోయల్, లోకేష్, ఎస్‌ఎ ఫ్‌ఐ నాయకులు రాజు, ప్రభాస్, మధు, నవ్య, ఏఐఎ ఫ్‌డీఎస్ నాయకుడు వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 12:40 AM