రెవెన్యూ సదస్సులతో భూసమస్యలకు పరిష్కారం
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:14 PM
భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో భూసమస్యలకు శాస్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మండలంలోని జెండావెంకటాపూర్, నా రాయిపేట గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని దరఖాస్తు ల ప్రక్రిను పరిశీలించారు.
నెన్నెల, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో భూసమస్యలకు శాస్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మండలంలోని జెండావెంకటాపూర్, నా రాయిపేట గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని దరఖాస్తు ల ప్రక్రిను పరిశీలించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రికార్డు లతో సరిచూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 20వ తేది వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి దరఖా స్తులు తీసుకుంటామన్నారు. నూతనం చట్టం ద్వారా రికార్డుల్లోని తప్పులను సవరించే అవ కాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేముందు భూములు వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, నక్ష తయారు చేస్తారని చెప్పారు. పెండింగ్ సాదాబైనా మా దరఖాస్తులను నిబందనల ప్రకారం పరిశీలించి, అర్హులకు పట్టాచేస్తామన్నారు. వార సత్వ భూములకు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేపట్టి వారసులకు నోటీ సులు ఇస్తామన్నారు. దరఖాస్తుతో పాటు రిజిస్టర్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జత చే స్తే త్వరగా పరిష్కారం లభిస్తుందన్నారు. అటవీ భూముల్లో సాగుకు చేసుకున్న ద రఖాస్తులను సంబందిత కమిటీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందన్నారు. వానాకాలం పంట సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సీజన్‌కు సరిపడ యూరియా అందుబాటులో ఉంచు తామ న్నారు. మిషన్ భగీరథ నీరు ప్రతి వీధికి అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మంచిర్యాల నుంచి నార్వాయిపేటకు ఆర్టీసీ బస్సు నడిపించాలని అక్క డి ప్రజలు కోరగా, అధికారులతో మాట్లాడి బస్సు నడిపిస్తామన్నారు. నూతన రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులందరికి రేష న్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకున్న దని, కళ్లాలోలని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశిం చారు. మైలారంలో రేషన్‌షాపును సందర్శించి సన్నబియ్యం సరఫరాను పరిశీలించా రు. మూడు నెలల బియ్యాన్ని ఈనెల 30 లోగా ఒకేసారి సరఫరా చేస్తామన్నారు. ఆ యన వెంట తహసిల్దార్ మహేంద్రనాథ్, డిప్యూటీ తహసిల్దార్ ప్రకాష్ ఉన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 11:14 PM