భూ భారతితోభూ సమస్యలు పరిష్కారం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:27 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం-2025 ద్వారా భూ సంబంధ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ అమ రేందర్ అన్నారు.
- అదనపు కలెక్టర్ అమరేందర్
చారకొండ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం-2025 ద్వారా భూ సంబంధ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ అమ రేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రం లోని రైతు వేదికలో తహసీల్దార్ అద్దంకి సునీత అధ్యక్షతన భూ భారతి 2025 చట్టంపై అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన స దస్సుకు అదనపు కలెక్టర్ అమరేందర్, కల్వకుర్తి ఆర్డీవో శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల దీర్ఘకాల సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్ర భుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. గత ధరణి పోర్టల్ ద్వారా అధికారు లకు అధికారం లేకుండా ఉండేదని అన్నారు. నూతన భూ భారతి చట్టంలో రైతులకు అనేక సౌకర్యాలు కల్పించిందని పేర్కొన్నారు. అన్నా రు. భూ భారతి అవగా హన సదస్సుకు వచ్చిన వారికి మండల వైద్యాధి కారి డాక్టర్ మంజుభార్గ వి ఆధ్వర్యంలో వైద్యశి బిరం ఏర్పాటు చేశారు.
రైతులకు రక్షణ కవచం
భూ భారతి చట్టం చట్టం రైతుల భూములకు రక్షణ కవచంలా పని చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో వీడి యో కాల్‌లో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పేరుక పోయిన భూ సమస్యలకు భూ భారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. అ నంతరం మండల కేంద్రంలో నిర్మించిన ఇందిర మ్మ ఇల్లు నమూన నిర్మాణ భవణాన్ని ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ సునీత, నాయకులతో కలిసి అదనపు కలెక్టర్ అమరేందర్ పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్, మండ ల వ్యవసాయశాఖ అధికారి తనూజరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాం గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ విద్యాధరిరెడ్డి, ఎంపీ వో వెంకటేష్, సింగిల్‌విండో డైరెక్టర్ కొండల య్యగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, జైపాల్, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:27 PM