kumaram bheem asifabad- ప్రజా సమస్యలపై పట్టింపు కరువు
ABN, Publish Date - Jul 15 , 2025 | 10:54 PM
తెలంగాణ రాష్ట్రంలోని పాలకులకు ప్రజల సమస్యలపై పట్టింపు కరువైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తుంగమడుగు గ్రామం సమీపంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.
కాగజ్‌నగర్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని పాలకులకు ప్రజల సమస్యలపై పట్టింపు కరువైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తుంగమడుగు గ్రామం సమీపంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి బూతులు మాట్లాడడం కాకుండా ప్రజల బాధలు చూడాలన్నారు. కాగజ్‌నగర్‌కు ఆనుకొని ఉన్న తుంగమడుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదన్నారు. ఈ గ్రామంలో మహిళలు, గర్భిణులు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డు బాగా లేక పోవటంతో అంబులెన్స్ రాని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, జిల్లా నాయకులు, అధికారులు స్పందించి గ్రామీణుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 10:54 PM