డా.నాగేశ్వర్‌రెడ్డి భారతరత్న అందుకోవాలి
ABN, Publish Date - Feb 04 , 2025 | 04:20 AM
పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని సత్కరించడం తెలుగువారందరికి గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.
మంత్రి కోమటి రెడ్డి ఆకాంక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని సత్కరించడం తెలుగువారందరికి గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి మంత్రి వెళ్లి నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిమ అందజేసి సన్మానించారు. వైద్య రంగంలో అనేక పరిశోధనల ద్వారా ఎందరికో ప్రాణం పోస్తున్నారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ నాగేశ్వర్ రెడ్డి సేవలను గుర్తించి పద్మ అవార్డులు ఇవ్వడం చాలా సంతోషమన్నారు.
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇంతకు ముందు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారని, ఇప్పుడు రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు పొందినట్టు తెలిపారు. మూడు పద్మ అవార్డులను అందుకున్న తొలి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన భారతరత్న, నోబెల్ బహుమతి అందుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
Updated Date - Feb 04 , 2025 | 04:20 AM