ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddy: కేసీఆర్‌..దమ్ముంటే అసెంబ్లీకి రా

ABN, Publish Date - Jun 25 , 2025 | 03:43 AM

కేసీఆర్‌కు ధైర్యం, నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే గోదావరి జలాలపై శాసనసభలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. ‘‘దమ్ముంటే స్పీకర్‌కు లేఖ రాయి... చెప్పిన తేదీ నాడు అసెంబ్లీ పెడతాం.

  • తెలంగాణ ద్రోహులెవరో అక్కడే తేల్చుకుందాం

  • గోదావరి, కృష్ణా జలాలు, బనకచర్లపై చర్చ పెడదాం

  • 3 వేల టీఎంసీలు వృథా పోతున్నాయని చెప్పిందెవరు?

  • రోజాకు రతనాల సీమ హామీ ఇచ్చిన చవట ఎవరు?

  • కృష్ణాలో 555 టీఎంసీల వాటా అడగకుండా

  • 299 టీఎంసీలకు సంతకం పెట్టింది మీరు కాదా?

  • లక్ష కోట్లు దోచుకున్న నిన్ను ఉరి తీసినా తప్పులేదు

  • కేసీఆర్‌ సచ్చిన పాము.. బీఆర్‌ఎస్‌ చచ్చిన పార్టీ

  • గోదావరి సెంటిమెంటుతో మంటపెట్టే ప్రయత్నం

  • కేసీఆర్‌ శకుని.. మేనల్లుడు హరీశ్‌ శనీశ్వరుడు

  • సోనియాకు అండగా నిలవాలని బాబును వదులుకున్నా

  • రైతు భరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌కు ధైర్యం, నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే గోదావరి జలాలపై శాసనసభలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. ‘‘దమ్ముంటే స్పీకర్‌కు లేఖ రాయి... చెప్పిన తేదీ నాడు అసెంబ్లీ పెడతాం. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత- చేవెళ్లను మార్చి రూ.లక్ష కోట్లు దోచుకున్నదెవరు?’’ అక్కడే తేల్చుకుందామన్నారు. ‘‘గోదావరిలో 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని, వాటిని రాయలసీమకు తరలించాలని 2016 చెప్పింది మీరు కాదా? మొత్తం వివరాలతో అసెంబ్లీకి వస్తా. మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించటానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని నిలదీశారు. కేసీఆర్‌ చెప్పిన తర్వాతే ఉమాభారతి ఆదేశాల మేరకు గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తరలించటానికి, హంద్రీనీవాకు 400 టీఎంసీలు తరలించటానికి 2016లో చంద్రబాబు జీవో ఇచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

2018లో వ్యాప్కో్‌సను నియమించింది నిజం కాదా? గోదావరి జలాలను బనకచర్లకు తరలించటానికి వ్యాప్కోస్‌ నివేదిక ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని కేసీఆర్‌ ఇచ్చిన బోడి, ఉచిత, దిక్కుమాలిన సలహాతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపురించిందని వ్యాఖ్యానించారు. రోజమ్మ పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయల సీమను రతనాల సీమగా చేస్తానని చెప్పిన చవటవు నీవు కాదా? అని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేసి ప్రజలు దీవిస్తే.. వందల టీఎంసీలు రాయలసీమకు తరలించమని చెప్పి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి ద్రోహం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం సచివాలయ ప్రాంగణంలో జరిగిన రైతు భరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,600 రైతు వేదికల్లో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీలు కేటాయిస్తే.. 512 టీఎంసీలు ఆంధ్రాకు తీసుకోవాలని, 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చంద్రబాబుకు వంగివంగి దండం పెట్టి చెప్పి సంతకం పెట్టింది నీవు కాదా? అని కేసీఆర్‌ను నిలదీశారు.

పదేళ్లలో ఏ ఒక్కరోజూ 299 టీఎంసీలు పూర్తిగా వాడలేదన్నారు. 68ు పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నందున 555 టీఎంసీలు తెలంగాణకు రావాలని, 299 టీఎంసీలకు సంతకం పెట్టి మరణ శాసనం రాసింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నపుడే రాయలసీమలో చంద్రబాబు ముచ్చుమర్రి కట్టారని ప్రస్తావించారు. జగన్‌ రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు జీవోలు ఇచ్చి, టెండర్లు పిలిచింది నిజం కాదా? పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీ లు తరలించటానికి సంతకాలు చేసింది నిజంకాదా? అని రేవంత్‌ నిలదీశారు. చేసిన తప్పులు కప్పి పుచ్చుకొని, మొఖం చెల్లక కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ల పడుకొని మేనల్లుడిని ఊరిమీద వదిలేస్తే అచ్చోసిన ఆంబోతులా తనను తిడుతున్నారని అన్నారు. కాంగ్రె స్‌ ప్రభుత్వం వచ్చాకే సీతారామకు 65 టీఎంసీల నీటి కేటాయింపులు తీసుకొచ్చామని, సమక్క-సారలమ్మ కోసం మోదీతో కొట్లాడుతున్నామని చెప్పారు. తుమ్మిడిహెట్టి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌కు నీళ్లు తెచ్చి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ప్రకటించారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌ సచ్చిన పాము. సచ్చిన పాము గోదావరి జలాల సెంటిమెంటుతో మంట పెడుతోంది. సచ్చిన పార్టీని బతికించుకోవటానికి సెంటిమెంటును అందుకున్నడు. ముందుగా హరీశ్‌రావును చూసి రమ్మని పంపిండు. తెలంగాణ రైతాంగం ఎడ్డోళ్లు కాదు.. గుడ్డోళ్లు కాదు’’ అని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ప్రకటించారు. కేసీఆర్‌ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడతామంటే ఇక్కడెవరూ ఊరుకునేటోడు లేడన్నారు. లక్ష కోట్లు కొల్లగొట్టి, వేల ఎకరాల భూములను ఆక్రమించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు గోదావరి బనకచర్ల ద్వారా చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి నీళ్లిస్తున్నాడని దుర్మార్గపు ప్రచారం చేస్తున్నడని రేవంత్‌ మండిపడ్డారు. చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండెటోణ్ణి కదా? రాహుల్‌గాంధీ ఆశీర్వాదం తీసుకుని ఇక్కడెందుకు ఉంటా? అని ప్రశ్నించా రు.

సోనియాగాంధీ కాళ్లకు దండం పెట్టి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసంచేసిన చరిత్ర కేసీఆర్‌దని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలని, చంద్రబాబును వదులుకొని కాంగ్రె స్‌లో చేరిన ఘనత తనదని రేవంత్‌ అన్నారు. కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదలుపెట్టిన తెలంగాణ ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటి కూడా గత పదేండ్లలో కేసీఆర్‌ పూర్తి చేయలేదన్నారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది మూడేళ్లలోనే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఉరి తీసి నా తప్పులేదని రైతులు అంటున్నారని వ్యాఖ్యానించారు. వానాకాలం రైతు భరోసా కింద 70 లక్షల కుటుంబాలకు, కోటిన్నర ఎకరాలకు, 9 వేల కోట్లు 9 రోజుల్లో చెల్లింపులు చేసి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని చెప్పారు. దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగగా మార్చిన ఘనత కాంగ్రెస్‌ దేనని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టిపోతే తమ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో రూ.7,625 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20,617 కోట్ల రుణ మాఫీ చేశామని చెప్పారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతులు దేశంలో మొదటి స్థానంలో రాష్ట్రాన్ని నిలిపితే అంతే ఉత్సాహంగా చివరి గింజవరకు కొంటున్నామని, సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇచ్చామని తెలిపారు. శకుని మామ కేసీఆర్‌కు శనీశ్వరుడైన అల్లుడు హరీశ్‌రావు తోడై తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు ఇవ్వాలంటే కోకాపేట భూములు అమ్మారని, రుణమాఫీ చేయాలంటే ఔటర్‌ రింగురోడ్డును తెగనమ్మారని, రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టారని రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణ రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? మొయినాబాద్‌లో హరీశ్‌రావుకు, జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌ ఎర్రవల్లిలో కేసీఆర్‌కు ఫామ్‌హౌజులు ఎట్లొచ్చినయ్‌? టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినయ్‌ అని నిలదీశారు.

వ్యవసాయం అంటేనే కాంగ్రెస్‌: భట్టి

రైతుల గురించి ఈ దేశంలో కాంగ్రెస్‌ తప్ప మరే పార్టీ ఆలోచన చేయదని, రైతులను ప్రేమించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటేనే వ్యవసాయం అని అన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 05:53 AM