MLC Kavitha: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:11 AM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం జూలై 17న నిర్వహించే రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు.
జూలై 17న చేపట్టే రైల్ రోకోకు మద్దతివ్వండి
సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలను కలిసిన ఎమ్మెల్సీ కవిత
చిక్కడపల్లి/రాంనగర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం జూలై 17న నిర్వహించే రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని, విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో న్యూడెమోక్రసీ నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, జె.వి.చలపతిరావు, కె.గోవర్ధన్‌లను ఆమె కలిశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమబాటనే మార్గం అని పేర్కొన్నారు. తమ ఉద్యమానికి మద్దతివ్వాలంటూ భావసారూప్యత కలిగిన శక్తులన్నింటినీ కలుస్తున్నామని వెల్లడించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. న్యూడెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పై కవిత చేస్తున్న ఉద్యమాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 05:12 AM