ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

ABN, Publish Date - Jul 24 , 2025 | 01:12 AM

విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండి లక్ష్యం వైపు ప్రయాణించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు.

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండి లక్ష్యం వైపు ప్రయాణించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధి కారులతో జిల్లా స్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదు అవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు నివార ణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా అధికారు లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్‌ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాల న్నారు. జిల్లాలో ఉన్న కస్తుర్బాగాంఽధీ విద్యాలయాలు, ఇంటర్‌, డిగ్రీ కళాశా లలు, ఇంజనీరింగ్‌ ఇతర ఉన్నత విద్యాసంస్థల వద్ద డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీస్‌, ఎక్సైజ్‌ ఇతర శాఖల అధికారులు సమన్వ యంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స కౌన్సెలింగ్‌ అందించేలా చర్య లు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రి లో డీఅడిక్షన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి అవసరమైన వారికి చికిత్సలు అం దించాలని సూచించారు. అటవీశాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్‌ షాపుల్లో స్టాక్‌ వివరా లను ప్రతినెలా తనిఖీ చేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. అడిషన ల్‌ ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యా ర్థులకు, యువతకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని వ్యాస, రచన, డ్రాయింగ్‌ పోటీలు చేపట్టి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైధ్యాధికారి డాక్టర్‌ రజిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, జిల్లా ఇంటర్మీడియేట్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 01:12 AM