ప్రపంచానికి మోదీ అందించిన కానుక యోగా
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:42 AM
ప్రపంచానికి మోదీ అందించిన గొప్ప కానుక యోగా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి మోదీ అందించిన గొప్ప కానుక యోగా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. నేడు ప్రపంచంలోని 200పైగా దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, ఇది మోదీ చేసిన కృషి అన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపై మోదీకి ఉన్న నిబద్ధతే అందుకు నిదర్శమన్నారు. దేశాల మధ్య, మనుషుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా గొప్ప శక్తి అని, మోదీ ప్రపంచ దేశాలకు అందించిన మహాయోగమని అన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 12:42 AM