గర్భిణులకు యోగా వరంలాంటిది..
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:49 AM
గర్భిణులకు యోగా వరంలాంటిదని, సాధారణ ప్రసవానికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజి త అన్నారు.
సిరిసిల్ల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): గర్భిణులకు యోగా వరంలాంటిదని, సాధారణ ప్రసవానికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజి త అన్నారు. శుక్రవారం జిల్లా స్ర్తీ, శిశు, దివ్యాంగులు, వృద్ధు లు, ట్రాన్స్‌జెండర్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న కలెక్టరేట్‌లో గర్భిణులు, బాలింత లు, అంగన్‌వాడీ టీచర్లకు యోగాపై శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ యోగా పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగు తాయని అన్నారు. దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిరిసి ల్ల జిలాల్లో సి సెక్షన్‌లలో అత్యధిక శాతంతో ముందున్నాయని, యోగా నేర్చుకోవడం ఆసనాలు, ధ్యానం ద్వారా సాధారణ ప్రసవా లకు మళ్లించవచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరా జం మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించు కొని మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రసవ సమయం లో, బాలింత సమయంలో చేయవలసిన ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించారు. ఈ పద్ధ తులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని అన్నారు. రామకృష్ణ మఠం డాక్టర్ అంజలి, దీప్తిలు చాలా సాధారణ పద్ధతు లతో ఏవిధంగా యోగాను పూర్తిచేయవచ్చు, ధ్యానం గురించి వివ రించారు. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకో వాల్సి న జాగ్రత్తలు గురించి వివరించారు. పిల్లల డాక్టర్ సురేంద్ర బాబు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవ చ్చని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీవోలు సౌందర్య, ఉమారాణి, డాక్టర్ నాయిమా, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా, సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్‌చార్జి ప్రొటెక్షన్ ఆఫీ సర్ శ్రీనివాస్, చైల్డ్ లైఫ్‌లైన్ కోఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కోఆర్డినే టర్ మమత, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:49 AM