ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హక్కుల కోసం యాదవులు ఉద్యమించాలి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:49 AM

యాదవులు అన్ని రంగాల్లో తమ హక్కుల కోసం ఉద్యమించాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్‌ అన్నారు.

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : యాదవులు అన్ని రంగాల్లో తమ హక్కుల కోసం ఉద్యమించాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కార్యవర్గం సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్‌ మాట్లాడారు. ప్రస్తుతం యాదవులు అన్ని రంగాల్లో వివక్షతను ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు సామాజిక, ఆర్థికి, రాజకీయ రంగాలలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటాల కోసం రాజకీయ సామాజిక చైతన్యం కోసం ముందుకు సాగాలన్నారు. యాదవ విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి ఉన్నత విద్య కోసం వారికి భవిష్యత్తులో మెరుగైన విద్యనభ్యసించేలా ప్రోత్సహించాలన్నారు. యాదవ జాతి నేడు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా రాజకీయ రంగంలో కూడా వాటా సాధించాలంటే ఐకమత్యం అనే చైతన్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. సంఘం భవిష్యత్తు కార్యక్రమాల కోసం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లా అధ్యక్షుడు బొబ్బల మల్లేష్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి బత్తుల మహేందర్‌యాదవ్‌, న్యాయ విభాగం అధ్యక్షురాలు యమునాయాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి జగ్గాని మల్లేష్‌యాదవ్‌, జిల్లా గౌరవ సలహాదారులుగా శ్రీనివాస్‌యాదవ్‌, తోట్ల రాములుయాదవ్‌లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సభ్యులకు నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌యాదవ్‌ అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరియాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి వీరవేణి మల్లేష్‌యాదవ్‌, యాదవ కుల సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:49 AM