చట్టాలపై కార్మికులు అవగాహన పెంచుకోవాలి
ABN, Publish Date - May 21 , 2025 | 12:36 AM
చట్టాలపై కార్మికులు అవగాహన పెంచు కోవాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.
సిరిసిల్ల క్రైం, మే 20(ఆంధ్రజ్యోతి): చట్టాలపై కార్మికులు అవగాహన పెంచు కోవాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సిరి సిల్ల పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద నాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు తమ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రతి చేనేత కార్మికుడికి భద్రత ఉండాలన్నారు. కార్ఖాణలో పని చేసే కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, పిల్లలకు విద్య, వైద్యం తదితర సౌకర్యాలు కలిగి ఉండాలన్నారు. ఇవేవి లేకున్నా కార్మికులకు రక్షణ ఉండదన్నా రు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు నెలకొల్పారన్నారు. వీటి ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కలిగి ఉండాలన్నారు. వీటన్నింటిని కార్మికులకు చేరువ య్యే విధంగా కంపెనీ యజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు భద్రత తప్పనిసరన్నారు. కార్మికులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయం కోసం న్యాయసేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. ఒక దరఖాస్తుతో మీకు ఉచిత న్యాయం అందు బాటులో ఉంటుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే దరఖాస్తు చేసినచో వెంటనే న్యాయవాదిని కేటాయించి ఆ సమస్య పరిష్కారం వైపు న్యాయసేవాధికార సంస్థ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేష న్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:36 AM