ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:13 AM
నగరంలోని కళాభారతితో బుధవారం ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు దక్కింది. ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 1000 మంది కళాకారులు 10 గంటలపాటు నిర్విరామంగా భజన చేసి రికార్డు కైవసం చేసుకున్నారు.
కరీంనగర్ కల్చరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని కళాభారతితో బుధవారం ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు దక్కింది. ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 1000 మంది కళాకారులు 10 గంటలపాటు నిర్విరామంగా భజన చేసి రికార్డు కైవసం చేసుకున్నారు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, డాక్టర్ వేణుకుమార్ రికార్డులో పేరు నమోదైనట్లు ప్రకటించి ధృవ పత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కళాకారులకు రికార్డు ప్రశంసపత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్ ఫౌండర్ సల్వాజి ప్రవీణ్, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విష్ణుదాసు గోపాల్‌రావు, రఘుకుల తిలక పాట సృష్టికర్త కొండల స్వామి, బోగ శ్రీనివాస్, రవీందర్, జీఎల్ నామ్‌దేవ్, ఏపీ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
--------------------------------------------------------------
Updated Date - Jul 24 , 2025 | 12:13 AM