ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:51 AM

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మ గౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

గంభీరావుపేట, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మ గౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం లో శ్రీ షిరిడి సాయిబాబా గ్రామ మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రో ల్‌ బంకును కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా మూడో పెట్రోల్‌ బంకు ప్రారంభించిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమమే ఎజెండాగా ఇందిరమ్మ పాలను రాష్ట్రంలో కొనసాగు తోందన్నారు. మహిళలను కోటిశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని మొదటి సంవత్సరం రూ.21వేల కోట్ల వడ్డీ రుణాలను మహిళా సం ఘాలకు అందించడంతోపాటు వివిధ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కలె క్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ జిల్లాలో ఒక పెట్రోల్‌ బంకును దివ్యాం గుల ద్వారా చేశామని, ప్రస్తుతం మహిళా సంఘాల ద్వారా మరో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే మూడు నెలల్లో మహిళా సంఘాల ద్వారా మరో పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెట్రోల్‌ బంకు ద్వారా లక్షల రుపాయల ఆదాయాన్ని రివా ల్వింగ్‌ ఫండ్‌లో పెట్టి బాగా వినియోగించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ విజయలక్ష్మీ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు హామీద్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్వ హన్మాండ్లు, కాంగ్రెస్‌ జిల్లా ఉపా ధ్యక్షుడు తిరుపతి, పట్టణ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 12:51 AM