మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:45 AM
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిపేట, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు కోరుట్లపేట గ్రామాల్లో చైతన్య, భాగ్యశ్రీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలను ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్‌బేగం, మహిళలతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోనే రాజన్నసిరిసిల్ల జిల్లాకు 23దుకాణాలను మంజూరు చేయడం ప్రథమమని అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాలో మహిళా సంఘాలకు క్యాంటిన్లు, కోళ్లు, పాడి గేదెలు, ఆవు ల పెంపకం, ఆర్టీసీ బస్సులతో పాటు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. భవిష్యత్తులో పారిశ్రమికరంగంలోనూ రాణించేలా రైస్‌మిల్లులు, పెట్రోల్ బంకు లు, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. మూడు దుకాణాలను ప్రారంభించామని త్వరలో జిల్లాలోని పలు గ్రామాల్లో 20 దుకాణాలను ప్రారంభించి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, డీపీఎంలు శ్రీనివాస్, రవీందర్, మాణిక్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, వ్యవసాయ అధికారి రాజశేఖర్, ఎంపీవో రాజు, సెర్ఫ్ ఏపీఎం మల్లేశం, నాయకు లు నర్సయ్య, లక్ష్మారెడ్డి, బాబు, గిరిధర్‌రెడ్డి, గౌస్, శ్రీనివాస్, బాల్‌రెడ్డి, రామచంద్రం, దేవానందం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:45 AM