ఉచిత చేప పిల్లల పంపిణీ జరిగేనా!
ABN, Publish Date - May 31 , 2025 | 12:55 AM
జిల్లాలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధా రపడి జీవిస్తున్న మత్స్యకారులకు సకాలంలో ప్రభు త్వం ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
- గత ఏడాది మూణ్ణెళ్ల ఆలస్యంగా సరఫరా
- నాణ్యత లేవని తిప్పి పంపిన మత్స్యకారులు
- చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధా రపడి జీవిస్తున్న మత్స్యకారులకు సకాలంలో ప్రభు త్వం ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ప్రభుత్వం ఆల స్యంగా టెండర్లు పిలవడం, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అక్టోబర్‌లో తక్కువ సైజు, నాణ్యత లేని చేప పిల్లలను సరఫరా చేయడంతో మత్స్యకారులు తిరస్కరించారు. చెరువుల్లో చేప పిల్లలు పోయకుండా తిప్పి పంపించారు. ప్రభుత్వం తిరిగి వాటి స్థానంలో నాణ్యత, నిర్ణీత సైజు గల చేప పిల్లలను పంపిణీ చేయలేదు.
ఈ ఏడాది ముందస్తుగా రోహిణి కార్తెలోనే నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. దీంతో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. ఈ వర్షాకాలం సీజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం అఽధికారులు ప్రకటించారు. అందుకు అనుగు ణంగా కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు సంబంధిం చిన రేషన్ బియ్యంను వచ్చే నెలలో వినియోగదారు లకు పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. జూన్‌లో భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండే అవకాశాలున్నాయి. అప్పటి వరకు మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేయడం లేదు. టెండర్లను కూడా ఆహ్వా నించ లేదు. చేప పిల్లలనే పంపిణీ చేస్తారా, వాటికి బదులు నగదు మత్స్యకార సహకార సంఘాలకు అం దజేస్తారా అనే విషయమై స్పష్టత లేదు. మత్స్యకా రులకు ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి నుంచి చెరువులు, కుంటల లీజు డబ్బులు తీసుకోకపోవడమే గాకుండా, ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టింది. మొదట బాగానే చేప పిల్లల పంపిణీ జరిగి నప్పటికీ, ఆ తర్వాత పంపిణీలో జాప్యం జరగడంతో పాటు నాణ్యత లేనివి, తక్కువ సైజు గల చేప పిల్ల లను కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. గత ఏడాది కూడా కాంట్రాక్టర్లు అదేవిధంగా పంపిణీ చేస్తే మత్స్యకారులు తిరస్కరించారు.
ఫ జిల్లాలో 1018 చెరువులు, కుంటలు...
జిల్లాలో 1018 చెరువులు, కుంటలు, శ్రీపాద ఎల్లం పల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఉన్నాయి. వీటిలో కోటి 90 లక్షల చేప పిల్లలు పోయాల్సి ఉంటుంది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడం లేదు. ఈ రెండింటిని మినహాయిస్తే కోటి 60 లక్షల చేప పిల్లలు అవసరం ఉంటాయని జిల్లా మత్స్య శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. చిన్న చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు గలవి. పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 85 నుంచి 100 ఎంఎం సైజు గల చేప పిల్లలు పోయాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది తక్కువ సైజు గలవి, నాణ్యత లేని చేప పిల్లలను కాంట్రాక్టర్లు తీసుకవస్తే వాటిని తిరస్కరిం చారు. వాస్తవానికి యేటా జూలై నెలాఖరు వరకు భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండుతు న్నాయి. ఆ సమయంలో వాటిల్లో చేప పిల్లలు పోస్తేనే అవి బాగా పెరుగుతాయని, వేసవి కాలంలో చెరువు లు, కుంటల్లో నీళ్లు అడుగంటే సమయంలో ఒక కిలో వరకు చేప పిల్లలు పెరుగతాయని మత్స్యకారులు చెబుతున్నారు. కానీ ఆలస్యంగా పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వ సొమ్ము వృథా మినహా తమకు కలిగే ప్రయోజనం ఏమి లేదని అంటున్నారు. చేప పిల్లలకు బదులు కాంట్రాక్టర్లకు చెల్లించే డబ్బులను తమ సం ఘాలకు ఇస్తే తామే నాణ్యత గల చేప పిల్లలను పెంచుతామని మత్స్యకారులు అంటున్నారు. ఆ దిశగా ఆలోచన చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఫ చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలి..
- కొలిపాక నర్సయ్య, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు
చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేస్తే ప్రయోజకరంగా ఉంటుంది. యేటా ఉచిత చేప పిల్లల పంపిణీ ఒక ప్రహసనంగా మారుతున్నది. కాం ట్రాక్టర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. నాణ్యత లేని, తక్కువ సైజు గల చేప పిల్లలకు మాకు అంటగట్టి ఉపాఽధిని కొల్లగొడుతున్నారు. సకాలంలో చేప పిల్లలను సరఫరా చేయని కారణంగా ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేయాలి.
Updated Date - May 31 , 2025 | 12:55 AM