భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:43 AM
నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టంపై రైతులకు ప్రజలకు విస్తృత ప్రచారం కల్పి స్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
బోయినపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టంపై రైతులకు ప్రజలకు విస్తృత ప్రచారం కల్పి స్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బోయిన పల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులు, ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీ ప్‌కుమార్ ఝా మాట్లాడుతూ, భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025పై రైతులకు అవగాహన కల్పించేం దుకు జిల్లాలో ఈనెల 17 నుంచి 29వ తేదీ వరకు ప్రతి మండ లంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్న ప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని స్పష్టం చేశారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వా త కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చని, దరఖా స్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అంది స్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేస్తామని వెల్లడించారు. రెవె న్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపా లన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూదార్ సం ఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్య ను ఎవరు..ఎన్ని రోజులలో పరిష్కరించాలి.. అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్‌కు వెళ్లాలని దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని, సీసీఎల్‌ఏకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్ట ర్‌కు అధికారాలను అప్పగించిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పీవోటీ, ఎల్‌టీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లం ఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీచేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయన్నారు. కొనుగోలు, దానం తనకా బది లీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దా ర్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మారుకసలు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీచేస్తారని, స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిషన్ ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని, దస్తావేజుతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని తెలి పారు. వారసత్వం లేదా వీలు నామా ద్వారా భూమిపై హక్కుల సంక్ర మిస్తే తహసిల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణిత గడువులోగా పూర్తిచేయకుంటే ఆటోమేటిక్‌గా మ్యూటే షన్ జరుగుతుందన్నారు. భూమి హక్కు కలిగిన రైతులందరికీ ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు. అనంతరం పలువురి అనుమా నాలు, సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ, సిరిసిల్ల ఆర్డీవోలు రాజేశ్వర్, రాధాబాయి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భూపేష్ రైతులు, నాయకులు, అధికారులు, తది తరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:43 AM