నెలకోసారి వచ్చే కేటీఆర్‌కు ప్రొటోకాల్ ఎందుకు?
ABN, Publish Date - May 26 , 2025 | 12:51 AM
నెలకొకసారి నియోజకవర్గానికి వచ్చే కేటీ ఆర్‌కు ప్రొటోకాల్ ఎందుకని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజు ప్రశ్నించారు.
తంగళ్లపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): నెలకొకసారి నియోజకవర్గానికి వచ్చే కేటీ ఆర్‌కు ప్రొటోకాల్ ఎందుకని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజు ప్రశ్నించారు. ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యా లయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు కేటీఆర్ గెలి పించింది ప్రజా సమస్యలు తీర్చడానికా? విదేశీ టూర్లు పోవడానికా ప్రజల్లో ఉండని నాయకుడికి ప్రొటోకాల్ ఎందుకు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవక పోయిన అధికార పార్టీ నేతగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలే తన ప్రొటోకాల్‌గా పనిచేస్తున్న వ్యక్తి కేకే మహేందర్‌రెడ్డి అని అభివర్ణించారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా తన బాధ్యత మరిచిపోవడంతోనే ప్రజల పట్ల తనకున్న బాధ్యతను కేకే నిర్వర్తిస్తున్నాడని అన్నారు. ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ నేతలు బర్త్‌డే పార్టీలకు, విందు పార్టీలకు ఉపయోగించుకుంటున్న వారు ప్రొటోకాల్ గురించి మాట్లాడేదని మీరా నాయకులా అని ఎద్దేవా ఏశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటున్న కేకే మహేందర్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతుంటే బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతు న్నారని విమర్శించారు. ప్రొటోకాల్ గురించి బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ ఎమ్మల్యే క్యాంప్ ఆఫీస్ బీఆర్‌ఎస్ నాయకులకు అడ్డాగా మారిందని బర్డ్ డే పార్టీలకు, విందులకు నిలయంగా మారిందని విమ ర్శించారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం బీఆర్‌ఎస్ నాయకులు క్యాంప్ కార్యాలయంలో విందులు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో పెట్టకపోవడం బాధాకరం అని.. ప్రొటోకాల్ గురించి మాట్లాడే బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు ఈ విషయంలో ప్రొటోకాల్ గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టకపోతే కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి ఫొటో పెట్టడం ఖాయమన్నారు. ఈ సమావేశం లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సాయిప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు గడ్డం మధుకర్, వినోద్, శ్రీనివాస్, అనిల్, దేవదాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:51 AM