ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేరస్థులపై కొరడా..

ABN, Publish Date - Jul 17 , 2025 | 01:06 AM

జగిత్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సమాజంలో రోజురోజుకూ చిన్న విషయాలకు ఘర్షణ పడడం, ఇతరులపై కక్షలు పెంచుకొని దాడులు చేయడం వంటి నేరాలు పెరుగుతున్నాయి. పలు సందర్భాల్లో మనిషి ప్రాణాలు తీసే వరకు ఆయా అంశాలు దారి తీస్తున్నాయి. ఆయా కేసులకు సంబంధించి నిందితులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించి అభియోగ పత్రాలు దాఖలు చేయడంలో జిల్లా పోలీసులు సక్సెస్‌ అవుతున్నారు.

-ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి పోలీసుల ప్రత్యేక శ్రద్ధ

-నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాల సేకరణ

-అవసరమైన రుజువులు, పత్రాలు, వాగ్మూలం కోర్టుకు సమర్పణ

-ఈ యేడాది జిల్లాలో ఇప్పటి వరకు 23 మందికి జీవిత ఖైదు

జగిత్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సమాజంలో రోజురోజుకూ చిన్న విషయాలకు ఘర్షణ పడడం, ఇతరులపై కక్షలు పెంచుకొని దాడులు చేయడం వంటి నేరాలు పెరుగుతున్నాయి. పలు సందర్భాల్లో మనిషి ప్రాణాలు తీసే వరకు ఆయా అంశాలు దారి తీస్తున్నాయి. ఆయా కేసులకు సంబంధించి నిందితులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించి అభియోగ పత్రాలు దాఖలు చేయడంలో జిల్లా పోలీసులు సక్సెస్‌ అవుతున్నారు. తక్కువ వ్యవధిలోనే నేరస్థులకు కచ్చితమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నేరస్థులపై కేసులు నమోదు చేసి, విచారణ చేయడం, అందుకు అవసరమైన పత్రాలు, రుజువులు సేకరించడం, కోర్టుకు సమర్పించడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 23 మంది నేరస్థులకు జీవిత ఖైదు పడింది.

ఫఫిర్యాదు నుంచి కేసు పూర్తయ్యే వరకు..

జిల్లాలో పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం మొదలుకొని కేసు పూర్తయి నేరస్థులకు శిక్ష పడే వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పోలీసు అధికారుల నుంచి మొదలుకొని కోర్టు కానిస్టేబుల్‌ వరకు ప్రత్యేకంగా తీసుకుంటున్న జాగ్రత్తలు నేరస్థులకు శిక్ష పడడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి. సరియైున పద్ధతిలో కేసు విచారణ కొనసాగించడంతో పాటు, కేసును ఛేదించిన అనంతరం తగిన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఇటీవల కాలంలో జిల్లాలో అత్యధిక కేసుల్లో శిక్షలు పడుతున్నాయి.

ఫగణనీయంగా పెరుగుతున్న శిక్షలు..

జిల్లాలో ప్రస్తుత యేడాదిలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పలు కేసుల్లో 23 మంది నేరస్థులకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2022 సంవత్సరంలో ఇద్దరికి, 2023 సంవత్సరంలో 14 మందికి, 2024 సంవత్సరంలో 10 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వివిధ కేసుల్లో 227 మందికి శిక్షలు పడ్డాయి. గతంలో కంటే భిన్నంగా ఈ యేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వివిధ కేసుల్లో 23 మందికి జీవిత ఖైదు శిక్ష పడడం, 25 సంవత్సరాల జైలు శిక్ష ఒకరికి, ఇద్దరికి పది సంవత్సరాల జైలు శిక్ష, ఇరువురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఐదుగురికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, మూడు సంవత్సరాల జైలు శిక్ష ఎనిమిది మందికి, రెండు సంవత్సరాల జైలు శిక్ష ఇరువురికి, ఒక సంవత్సరం లోపు జైలు శిక్ష నలుగురికి విధించబడ్డాయి. జిల్లాలో ప్రస్తుత యేడాది వివిధ కేసుల్లో సుమారు 55 మందికి శిక్షలు విధించడం గమనార్హం. ఇందులో హత్య కేసులు, పొక్సో కేసులతో పాటు ఇతర నేరాలకు సంబంధించిన కేసులు సైతం ఉన్నాయి.

ఫఎస్‌హెచ్‌వోలు, కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం

నేరస్థులకు శిక్షలు పడేలా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో), కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణ చేస్తూ ఎస్‌హెచ్‌వోలు, కోర్టు కానిస్టేబుళ్లకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలం కోర్టుకు సమర్పించడంపై పకడ్బందీగా దృష్టి సారిస్తున్నారు. కోర్టు సమాచారం, ప్రాసిక్యూషన్‌కు సంబంఽధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు, కోర్టు కానిస్టేబుళ్లకు తెలియజేస్తుండడం, కేసు ట్రయల్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల యొక్క సూచనలు పాటిస్తుండడంతో నేరస్థులకు కచ్చితమైన శిక్షలు పడటానికి దోహదపడుతున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

జిల్లాలో ఈ యేడాది విధించబడిన శిక్షలు..

ఫ కోరుట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి నాలుగు సంవత్సరాలు జైలు, రూ.9,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

ఫ రాయికల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వృద్ధురాలిపై అత్యాచారం కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు, రూ.5,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

ఫ పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు ఐదు సంవత్సరాల జైలు, ఒక్కొక్కరికి రూ.1500 జరిమానా విధించారు.

ఫ ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ హత్య కేసులో ఏడుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చింది.

ఫ రాయికల్‌ మండలం ధర్మాజిపేటలో మద్యం మత్తులో గొడవపడి వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఇద్దరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ఫ జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లి శివారులో మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.15 వేల జరిమానా విధించారు.

ఫ గొల్లపల్లి స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు, రూ.12,200 జరిమానా విధించింది.

ఫ రాయికల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.17 వేల జరిమానా విధించారు.

ఫ మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో భూ తగాదాలో అన్నను గాయపరిచిన తమ్ముడికి మూడు సంవత్సరాల జైలు, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

నేరస్థులు తప్పించుకోలేరు

-అశోక్‌ కుమార్‌, ఎస్పీ

సమాజంలో నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. ప్రాసిక్యూషన్‌ వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తున్నాం. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు స్వీకరించినప్పటి నుంచి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, పకడ్బందీగా విచారణ జరపడంపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షాధారాలను సేకరించడం, కోర్టులో ప్రవేశపెట్టడం, నేరస్థులకు శిక్ష పడడానికి కృషి చేస్తున్నాం.

Updated Date - Jul 17 , 2025 | 01:06 AM