ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్వాడి ఖాళీల భర్తీ ఎప్పుడు?

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:32 AM

మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నా రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిప్రాంతాల్లో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.

- జిల్లాలో 68 టీచర్‌, 227 ఆయా పోస్టులు ఖాళీ

- రెండేళ్లుగా భర్తీ కానీ పోస్టులు, టీచర్లపై అదనపు భారం

- ఎదురుచూస్తున్న ఆశావహులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నా రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిప్రాంతాల్లో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 68 టీచర్‌ పోస్టులు, 227 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందు తున్నారు. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ టీచర్లకే పక్కను న్నటు కేంద్రాలకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇస్తున్నారు.

జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని ప్రాజెక్టుల పరిధిలో 706 అంగన్వాడి కేంద్రాలు ఉండగా, వీటిలో 6491 మంది గర్భిణులు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 35,649 మందికి పూర్వ ప్రాథమిక విద్యను, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. టీచర్లకు నెలకు 13 వేలు, ఆయాలకు 7,800 రూపా యల వేతనం ఇస్తున్నారు. ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయాల పోస్టులను అంగన్‌వాడీవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భర్తీ చేయాలని ఆందోళన కొనసాగిస్తున్నా భర్తీ చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వ ర్యంలో నడిచే అంగన్వాడి కేంద్రాలు చిన్న పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు వారి ఆరోగ్యానికి సంబంధించి ఆహారాన్ని అందిస్తాయి. చివరిసారిగా 2020-21లో ఖాళీ పోస్టులను భర్తీ చేసినప్పటికీ అప్పటినుంచి ఇప్పటివరకు చాలా పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అంగన్‌వాడీల టీచర్లు, ఆయాల వయసు 65 సంవ త్సరాలు వచ్చే సరికి పదవీ విరమణ చేయాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు చాలా వరకు టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. 2023 నవంబర్‌ చివరన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయకపోవడంతో వాటిపై ఆశలు పెట్టుకున్న మహిళలు ఆందోళనలకు గురవుతున్నారు.

ఫ లబ్ధిదారులకు అందని పౌష్టికాహారం

జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవ డంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అం దడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే గర్భిణులు, బాలింతలు, ఐదేండ్లలోపు పిల్లలు రక్తహీనతకు గురి కాకుండా, శారీరకంగా బలహీనం కాకుండా ఉండేం దుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రోజూ పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్డుతోపాటు ఆకుకూరలు, ఇతర కూరలతో పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాల్లో టీచర్లు ఉంటేనే అందరికీ పౌష్టికాహారం సక్రమంగా అందతుంది. అలాగే ఆరోగ్య, ఇతర సర్వేల బాధ్యత లను అంగన్‌వాడీ టీచర్లకే అప్పగిస్తుంటారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా, కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతున్నది. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో టీచర్లే ఆ భారాన్ని మోస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్లకు సర్వే బాధ్యతలు అప్పగించడంతో కేంద్రాలు మూతబడుతున్నాయి.

ఫ మారిన నిబంధనలు..

గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత నిబంధన ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులకు నియ మితులయ్యే వారు కనీసం ఇంటర్‌ ఉత్తీర్ణత ఉండాలని నిబంధన పెట్టింది. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది. ఖాళీల్లో 50 శాతం ఆయాలకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. అయినా కూడా అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆశావహులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మహిళలు కోరుతున్నారు.

ఫ నోటిఫికేషన్‌ వచ్చాకే భర్తీ

- వేణు గోపాల్‌, జిల్లా సంక్షేమ అధికారి

జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర కమిషనరేట్‌ నుంచి నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పోస్టులను భర్తీ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల వివరాలు సేకరించాం. ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్లే పనిచేస్తున్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం.

Updated Date - Jun 11 , 2025 | 01:32 AM