‘భూ భారతి’తో భూసమస్యల పరిష్కారం
ABN, Publish Date - Apr 23 , 2025 | 01:06 AM
భూ భారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
రుద్రంగి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో చట్టంపై రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కూమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి చట్టంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. రైతుల భూసమస్యలను దూరం చేయాలనే ఉద్దేశం తోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తోపాటు ఇతర మంత్రులు, నిపుణులతో భూ భారతి చట్టాన్ని రూపొందిం చినట్లు తెలిపారు. అనంతరం కల్టెక్‌ర్ సందీప్ కూమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వారందరీ భూ సమస్యలు భూ భారతి చట్టంలో భాగంగా పరిష్కరిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూం జలపతి, గట్ల మీనయ్య, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయణ, పల్లి గంగాధర్, పుట్కపు మహిపాల్, స్వర్గం పరాంధామ్, పిడుగు లచ్చిరెడ్డి, గుగ్గిళ్ల వేంకటే శం, దయ్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 01:06 AM