అన్నదాతలకు అండగా ఉంటాం
ABN, Publish Date - May 24 , 2025 | 12:30 AM
రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల అగ్రికల్చర్/జగిత్యాలరూరల్/సారంగాపూర్, మే 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల మండలం చల్‌గల్ వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు తిప్పన్నపేట, సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామాల్లో అకాలవర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులు అధైర్యపడొ ద్దని తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకునేందుకునేందుకు అఽధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీల కొరతతో కొనుగోళ్లు కొంత ఆలస్యం అవుతుందన్నారు, అకాల వర్షాల వల్ల కొంత నష్టం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ అపలేరని, కానీ అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చల్‌గల్ కేంద్రంలో 1,444 క్వింటాళ్ల సన్నవడ్ల ను కొనుగోలు చేశామని తెలిపారు. కార్యక్ర మంలో జగిత్యాల, కోనాపూ ర్ సహకార సంఘం చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్‌రావు, నాయకు లు మల్లారెడ్డి, నక్కల రవీందర్‌రెడ్డి, పెండెం రాములు, బాల ముకుందం, కోల శ్రీనివాస్, భోనగిరి నారాయణ, శేఖర్ గౌడ్, సంఘ సీఈవో గాజెంగి వేణుతో పాటు రైతులు పాల్గొన్నారు.
అన్నదాతలు అధైర్యపడవద్దు
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్/రాయికల్, మే 23 (ఆంధ్రజ్యోతి): రైతులెవరూ అధైర్యపడవద్దని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుం దని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల మండలం తిప్పన్నపేట-గోపాల్‌రావుపేట, రాయికల్ మండలంలోని మూటపెల్లి, భూపతిపూర్ గ్రామాల్లోని ధాన్యంకొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తూకంవేసిన ధాన్యం నిల్వ ఉండటంతో అధి కారులతో మాట్లాడి ధాన్యం లోడ్ చేయాలని సూచించారు. తడిసిన ధా న్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చిం దని, ఇప్పటికే సంబంధిత జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్యను పరిష్కరించడానికి చూస్తానని తెలిపారు. ఆయనవెంట కాంగ్రెస్ నాయ కులు లైశెట్టివిజయ్, భారతపు గంగన్న, బండారి మధు, రైతులున్నారు.
Updated Date - May 24 , 2025 | 12:30 AM