ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్యకర్తలకు అండగా ఉంటాం..

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:52 AM

కార్యకర్తలకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్‌ అన్నారు.

సిరిసిల్ల టౌన్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తలకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాలకు చెందిన బీ ఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కేటీఆర్‌ సమావేశాలను నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సమన్వయం ఐక్యతతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో గులాబీ జెండాను ఎగరవేయాలన్నారు. సిరిసిల్లలో పార్టీని ఓడించే వారేలేరని కాంగ్రెస్‌ బీజేపీ పార్టీలకు అభ్యర్థులే కనబడడం లేదన్నారు. మెజార్టీ స్థానాల ను గెలిచి అధికారాన్ని తిరిగి సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలను పార్టీ శ్రేణులను ఇబ్బందికి గురిచేస్తున్న ప్రభుత్వ అధికారులంతా సహకరిస్తారన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం స్థానిక ఎమ్మెల్యేగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గత 20 నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని విమర్శించా రు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని విస్మరించి అవి నీతి అరాచకాలకు తెరలేపిందని ఆరోపించారు. రైతులకు, నిరుద్యో గులకు, వృద్ధులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించి ఉత్తమాటలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలం గడుపు తుందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చే స్తుందని ఓట్ల సమయంలో రైతు బంధు ఇస్తుందని అన్నారు. వ్యవ సాయం బాగుండాలంటే మళ్లీ కేసీఆర్‌ రావాలని రైతులు అభిప్రా యపడుతున్నారని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను, విద్యార్థులను మోసం చేసిందని, ఆడపిల్లలకు స్కూటీలు, నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుం డా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం పేరు చెప్పి మిగిలిన హామీలన్నింటిని ఎగ్గొట్టిందని విమ ర్శించారు. ప్రజలందరికి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కోపం పెరిగింద ని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ది చెబుతారని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు బీసీలను కూడా మోసం చేసిందిని బీసీలకు రిజర్వేషన్‌ పేరుతో జరుగుతున్న మోసంను బీసీలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకు పార్టీ కార్యకర్త లు తీసుకెళ్లాలని సూచించారు. పల్లెలో మౌళిక సదుపాయాలు, వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేద న వ్యక్తంచేశారు. గ్రామాల్లో డిజీల్‌ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పల్లెలు జాతీయస్థాయి అవార్డులు గెలుచుకున్నాయని గుర్తుచేశారు. సిరిసిల్ల ఎట్లా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారని కేటీ ఆర్‌ అన్నారు.

రామన్న జపమే..

రాష్ట్రమంతా రామన్న(కేటీఆర్‌) జపమే చేస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గంలో రామన్నకు ఓటమి లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లో మనం గెలిస్తే కాంగ్రెస్‌ ఇందిరమ్మ కమిటీలే ఉండవన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి సిరిసిల్ల గడ్డపై గులాబి జెండ ఎగరవేయాలన్నారు.

రాష్ట్రంలో అసమర్థ పాలన..

తెలంగాణ రాష్ట్రంలో అసమర్ధ పాలన నడుస్తుందని బోయినపల్లి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్‌ అన్నారు. కేసీఆర్‌ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఐక్యంగా కొట్లాడి రాష్ట్రంతో పాటు సిరిసిల్లలో గులాబీ జెండాను ఎగరవేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితలు లేవన్నారు. అంతకు ముందు తెలంగాణ భవనంలో సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌, నాయకులు సీనారే చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, నాఫ్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీంధర్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, నాల్యకొండ అరుణరాఘవరెడ్డి, నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, కుంభాల మల్లారెడ్డి, పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:52 AM