ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం

ABN, Publish Date - May 31 , 2025 | 12:29 AM

జగిత్యాల నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, అభివృద్ది సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

సీసీ రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల అర్బన్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, అభివృద్ది సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 25వ వార్డులో ఎనిమిది లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును శుక్రవారం పరిశీలించారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగిత్యాల అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్న తాను 16 వార్డుల్లో రెండున్నర కోట్లతో అభివృద్ధి పనులు, మరో 25 వార్డుల్లో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశానని తెలిపారు. త్వరలో బీట్‌ బజార్‌ మార్కెట్‌ ప్రజలకు అందుబాటులోకి తీసు కు వస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని సూచించారు. ఇష్టారీతిన నిర్మాణాలు చేయడం వల్ల పట్టణంలో పలు కాలనీ లు జలమయం అయ్యో అవకాశం ఉన్నదని వివరించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కూతుదు రాజేశ్‌, కూసరి అనిల్‌, ఆరుముళ్ళ నర్సమ్మ, కోరె గంగమల్లు, రాజకుమార్‌, డిఈ వరుణ్‌, ఏఈలు శరణ్‌, అనిల్‌ గుమ్ముల అంజయ్య, కోటేశ్వర్‌రావు, శివనూరి రాకేష్‌, కొలగాని సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 12:29 AM