ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అవినీతి అధికారులను తొలగించాలని ఉద్యమిస్తాం..

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:59 AM

ప్రాజెక్టులు, చెక్‌డ్యా ముల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులపై సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపి వాని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు.

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ప్రాజెక్టులు, చెక్‌డ్యా ముల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులపై సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపి వాని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం కార్మిక భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా జిల్లాలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి పేదలకు పంచాలని భూ పోరాటా లకు ఉద్యమం చేపట్టడానికి కమ్యూనిస్టు పార్టీ పూనుకుంటుం దన్నారు. గత 100 సంవత్సరాలుగా అడ్డంకులను దాటుకుంటూ సవాళ్ళను ఎదుర్కొంటూ దేశంలోని పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహిస్తోందన్నారు. జిల్లాలో దాదాపు ఇళ్లు లేని నిరుపేదలు 20వేల పైచిలుకు ఉన్నారని, అందరికి డబుల్‌ బెడ్‌రూంలు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి ప్రభుత్వ అధికారులు దొరకడం చూస్తూంటే జిల్లాలో దోపిడీ అనేది బహిరంగగానే జరుగుతోందని అర్థం అవుతోందన్నారు. తంగళ్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో 1200 మందికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాక నిర్మాణం పనులు నిలిచి పోయాయని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం 1200 మంది ఇళ్ల నిర్మాణా నికి రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 16న సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న సీపీఐ 4వ మహాసభలో ఈ సమస్యలపై చర్చిస్తామని పేర్కన్నారు. సీపీఐ మహా సభకు ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కూనమనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గం సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొంటున్నారని అన్నారు. జిల్లాలోని కమ్యూని స్టులు, కార్యకర్తలు, అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికు లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు కడారి రాములు, ఎలిగేటి రాజ శేఖర్‌, అజ్జ వేణు, పంతం రవి పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:59 AM