మహిళలను కోటీశ్వరులు చేస్తాం
ABN, Publish Date - Jul 17 , 2025 | 01:08 AM
‘మహిళలు వ్యాపారులుగా ఎదిగి నలుగురికి ఉపాధి కల్పిం చాలని, కష్టాలు, కన్నీళ్లను అధిగమించి ఇక్కడ వరకు వచ్చారు.. ఒకప్పుడు భర్తను చేయి చాపి డబ్బులు అడుక్కునే స్థితి ఉంటే.. ప్రస్తుతం వాళ్లు మనల్ని అడిగే పరిస్థితికి ఎదిగాం.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గత ప్రభుత్వం మహిళలకు 3,500 కోట్ల వడ్డీ సొమ్మును ఎగ్గొడితే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్‌గా రుణాలు ఇస్తున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయ డమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతు న్నదని, రెండు, మూడు మాసాల్లో చీరలు పంపిణీ చేస్తామని, వీఓల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
పెద్దపల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ‘మహిళలు వ్యాపారులుగా ఎదిగి నలుగురికి ఉపాధి కల్పిం చాలని, కష్టాలు, కన్నీళ్లను అధిగమించి ఇక్కడ వరకు వచ్చారు.. ఒకప్పుడు భర్తను చేయి చాపి డబ్బులు అడుక్కునే స్థితి ఉంటే.. ప్రస్తుతం వాళ్లు మనల్ని అడిగే పరిస్థితికి ఎదిగాం.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గత ప్రభుత్వం మహిళలకు 3,500 కోట్ల వడ్డీ సొమ్మును ఎగ్గొడితే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్‌గా రుణాలు ఇస్తున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయ డమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతు న్నదని, రెండు, మూడు మాసాల్లో చీరలు పంపిణీ చేస్తామని, వీఓల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. బుధవారం పెద్దపల్లి పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ ఇందిర మ్మలాగా శక్తిమంతురాలిగా ఉండాలని సీఎం రేవంత్ కోరుకుంటున్నారని అన్నారు. కోటి మందిని కోటీశ్వర్లును చేసేందుకు సీఎం కంకణం కట్టుకు న్నారని అన్నారు. మాటల్లో కాకుండా తాము అధి కారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, అంతేగాకుండా వారిని ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశామన్నారు. మహిళా సంఘాలకు 26 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించామ న్నారు. రుణాలు ఇవ్వడమే గాకుండా వారిని వ్యాపారులుగా ఎదిగేలా చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 60 లక్షల మంది విద్యార్థులకు మహిళలచే యూని ఫామ్స్ కుట్టించామని, తద్వారా వారికి 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వారికి కమిషన్లు అందేలా చేశామన్నారు. అదాని, అంబానీలే కాదు మహిళలు కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయగలరని నిరూపిస్తున్నామన్నారు. మహిళలచే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, గోదాములు, రైస్ మిల్లులు నిర్వహించేలా చేస్తున్నామన్నారు. దుబయ్, ముంబయ్, సూరత్‌లో గాకుండా సిరిసిల్ల, చొప్పదండిలోనే నేతన్లకు చీరల ఆర్డర్ ఇచ్చామని, ఆవి వచ్చే వరకు రెండు, మూడు నెలల సమయం పడుతుందన్నారు.
ఫ ఐదేళ్లలో మహిళల ఖాతాల్లో లక్ష కోట్లు జమ
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
ఈ ఐదేళ్ల కాలంలో మహిళా సంఘాల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణా లను జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన సభలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా మని, మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని అన్నారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాలను ప్రజా ప్రభు త్వంలో పునరుద్ధరించామని అన్నారు. పామాయిల్ పెద్దపల్లి జిల్లాలో విస్తారంగా పండించాలని, ఎకరానికి మూడేళ్లలో 51 వేల రూపాయల సబ్సిడీ అందిస్తామని అన్నారు. పెద్దపల్లిలో తిరుమల కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుందని అన్నా రు. రాబోయే నెల రోజులలో సిద్దిపేటలో పెద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఫ మహిళలను కోటీశ్వరులను చేస్తాం
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేస్తామని, జిల్లాలో వి-హబ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం స్థల సేకరణ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ సంబరాలు ఎందుకు జరుపుతున్నామంటే సంవత్సర కాలంలో మహి ళల్లో మార్పు తీసుక వచ్చామని, గత ప్రభుత్వం పదేళ్ల పాటు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందని అన్నారు. మహిళల ఆదాయం పెంచేం దుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం, ఇందిరా శక్తి క్యాంటీన్, ఆర్టీసీకి అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మహిళా సమాఖ్య లకు రుణాలు, వడ్డీ రాయితీ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలోని మహిళా సమాఖ్యలకు కేటా యించిన 5 బస్సులను మంత్రులు ప్రారంభించారు.
ఫ మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ స్వయం సహాయక మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందని, వడ్డీ లేని రుణాల వడ్డీ బకాయిలను చెల్లించలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవసారి రుణాల వడ్డీ సొమ్మును మహిళల ఖాతాల్లో జమచేస్తు న్నదని అన్నారు. 32 మంది సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా కింద 41 లక్షల 69 వేల 873 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నా మని అన్నారు. పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, సుల్తానాబాద్ మండల సమాఖ్యల ద్వారా ఆర్టీసీ సంస్థకు ఏర్పాటు చేసిన అద్దె బస్సుల మొదటి నెల ఆదాయం 3 లక్షల 47 వేల 340 రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహిళలే నేరుగా నేడు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు పి వేణు, జే అరుణశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్ రావు, ఆర్‌డీఓలు రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, జెడ్పీ సీఈఓ నరేందర్, డీఆర్డిఓ ఎం కాళిందిని, డీపీఓ వీర బుచ్చయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏపిఎంలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 01:08 AM