ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్టీపీసీ ప్లాంటులో విపత్తు జరిగితే ఎదుర్కొంటాం

ABN, Publish Date - May 10 , 2025 | 12:25 AM

ఎన్టీపీసీ ప్లాంటులో ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతీ క్షణం అధికార యంత్రాంగం, సిబ్బంది సన్నద్ధంగా ఉందన్నారు.

ఎన్టీపీసీ ప్లాంటులో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల మాక్‌ డ్రిల్‌

- రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

జ్యోతినగర్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ ప్లాంటులో ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతీ క్షణం అధికార యంత్రాంగం, సిబ్బంది సన్నద్ధంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శుక్రవారం సాయంత్రం ఎన్టీపీసీ ప్రాజెక్టు ఆవరణలో భద్రతా సిబ్బందితో సీపీ ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అనుకోని దుస్సంఘటన జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండడంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి మాక్‌డ్రిల్‌ నిర్వహించినట్లు సీపీ పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం, అగ్నిప్రమాదాలు జరినప్పుడు భద్రతా దళాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను మాక్‌డ్రిల్‌ ద్వారా వి వరించామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్‌ కిరణ్‌,భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌

రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ఆ వరణలో సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్న క్రమంలో ఏదైనా విపత్తు జరిగితే తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు, ప్రాజెక్టు పరిసరాల్లో, పని స్థలాల్లో తనిఖీలు తదితర అంశాలను మాక్‌ డ్రిల్‌లో ప్రదర్శించారు. సీఐఎస్‌ఎఫ్‌ రావగుండం ఎన్టీపీసీ యూనిట్‌ సీనియర్‌ కమాండెంట్‌ అరవింద్‌ కుమార్‌, డిప్యూటీ కమాండెంట్‌ ఆంజనేయరాజు, డిప్యూటీ కమాండెంట్‌ ఓవికె శాస్త్రి పర్యవేక్షణలో జరిగిన మాక్‌ డ్రిల్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్లు జై కన్వర్‌, అకేశ్వర్‌సింగ్‌, ఇన్‌స్పెక్టర్లు, జవానులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:25 AM