బీసీ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:03 AM
బీసీ ఉద్యమాన్ని భారత దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహన్మాండ్లు అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : బీసీ ఉద్యమాన్ని భారత దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహన్మాండ్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ నెల 7న గోవాలో జరిగే ఓబీసీ 10వ మహాసభ వాల్‌పోస్టర్, కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్శహన్మాండ్లు మాట్లాడుతూ జనాభలో మేమెంతో అన్ని రంగాలలో మాకు అంతా వాటాను ఇవ్వాల్సిందేనని అన్నారు. 1990 ఆగస్టు 7న నాటి ప్రధాన మంత్రి వీపీ సింగ్ మొదటి సారిగా మండల కమీషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు ప్రకటించారని అప్పటి నుండి బీసీలంతా ఆగస్టు 7న మండల్ డేగా బావిస్తున్నారని అందుకే ఆగస్టు 7న ఓబీసీ మహాసభను గోవాలో నిర్వహిస్తున్నామన్నారు. బీసీల ఉద్యమాల వల్లే తెలంగాణలో కులగణన జరిగిందని దీంతో జాతీయా స్థాయిలో కూడా జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు డిల్లీలోని రాష్ట్ర పతి భవనంలో మూలుగుతున్నాయని వాటిని సాధించుకునే వారకు జాతీయ స్థాయి ఉద్యమాలను ఉదృతం చేస్తామన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ కేంద్ర బడ్జెట్‌లో బీసీల ధామాషా ప్రకారం నిధులు కేటాయించాలని బీసీ రిజర్వేషన్లు పెంచాలని చట్టసభలలో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు కల్పించాలని బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని అన్నారు. దేశ వ్యాప్త బీసీ ఉద్యమంలో బీసీలంత భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేష్‌యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్‌రెడ్డి, బీసీ సేవా జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీన్, నాయకులు బోయిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, దుబాల కొండయ్య, తడుక విఠల్, కోడం రవీందర్, అర్చనపెల్లి శ్రీనివాస్, బూర అంజనేయులు, ఇల్లంతకుంట తిరుపతి, కంచర్ల రాజు, కందుకూరి రామాగౌడ్, సామల శ్రీనివాస్, రాపెల్లి సురేష్ పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 01:03 AM