పంటలు ఎండకుండా సాగునీరు అందించాం
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:59 AM
వేసవిలో పంటలు ఎండిపోకుండా ప్రతీ ఎకరాకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
కాల్వశ్రీరాంపూర్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): వేసవిలో పంటలు ఎండిపోకుండా ప్రతీ ఎకరాకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట, ఎదులాపూర్, పెద్దరాతుపల్లి, వెన్నంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. జాఫర్‌ఖాన్‌పేటలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, పెద్దరాతుపల్లిలో నిర్మించిన పల్లెదవాఖాన భవనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కొత్తరేషన్ కార్డులు, హమాలీలకు లైసెన్సులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు కోటి రూపాయల ఖర్చుతో డీ-83 ఎస్సారెస్పీ 22ఆర్ పెద్దపల్లి దగ్గర నుంచి కాలువను ఇదిలాపూర్ వరకు శుభ్రం చేయించామన్నారు. చివరి కాలువలకు సాగునీరు అందించి చెరువులు, కుంటల్లో నీల్లను కూడా నింపి రైతుల పంపటలు కాపాడామని వివరించారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐదు లక్షల నిధులతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. 10సంవత్సరాలుగా రేషన్‌కార్డులు లేక అనేకమంది ఇబ్బందులు పడ్డారని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ప్రకటించే అభ్యర్థులను గెలిపించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజనవేన సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, డాక్టర్ శ్రీనివాస్, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, హౌసింగ్ ఏఈ వసంత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:59 AM