ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:41 AM

మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

సిరిసిల్ల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేష్‌ బీ గితేతో కలిసి జిల్లాస్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు నివారణ చర్య లు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదకద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులు, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే నష్టాలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన వాల్‌పోస్టర్‌లు, హ్యాండ్‌బుక్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ముఖ్య ప్రణా ళికఅధికారి ప్రస్తుతం క్రాప్‌కటింగ్‌ పరిశోధన జరుపుతున్నారని, వీరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ముగిసిన సంద ర్భంలో పరిసరాల్లో ఉన్న పాన్‌షాప్‌ వంటి వాటిపై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా బహిరంగంగా మద్యం సేవించకుండా చూడాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌, మండల వ్యవసాయ అధికారి, వైద్యాధికారులు పంచాయతీ కార్యదర్శు లతో సమావేశం నిర్వహించి డ్రగ్స్‌ నియంత్రణ ప్రణాళిక రూపొందిం చాలన్నారు. జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమ యాల్లో తనిఖీలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో ఉన్న బార్‌ లు, వైన్‌షాప్‌లు, ప్రభుత్వ నిర్ధేశిత సమయపాలన పాటించేలా చూడా లన్నారు. బార్‌ నిర్వహాకులతో వాట్సాప్‌ గ్రూప్‌ తయారుచేసి ప్రతిరోజు ఎప్పుడు మూసివేస్తున్నారో సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్‌ ని యంత్రణపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని డ్రగ్స్‌, గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరించే వీడియోలు, పోస్టర్‌లు ప్రదర్శించాలని, అవ గాహన కల్పించాలన్నారు. డ్రగ్స్‌ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్‌ కిట్‌లను పోలీస్‌లు, ఎక్సైజ్‌ శాఖ అధికారుల వద్ద అందుబా టులో ఉంచాలని డీఎంహెచ్‌వోకు సూచించారు. రైస్‌మిల్లులు, ఇటుక బట్టీల వద్ద కార్మిక అధికారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎస్పీ మహేష్‌ బీ గీతే మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్‌ మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాధాబాయి, కార్మికఅధికారి నజార్‌ అహ్మద్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ భవాని, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, ఫుడ్‌ సేప్టీ అధికారి అనూష, విద్య, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:41 AM