ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలిసేలా చేశాం

ABN, Publish Date - May 21 , 2025 | 12:41 AM

రాష్ట్రం లోని ఆర్థిక వ్యవస్థ ప్రతి పౌరుడు తెలుసుకునేలా చేశా మని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

వేములవాడ టౌన్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని ఆర్థిక వ్యవస్థ ప్రతి పౌరుడు తెలుసుకునేలా చేశా మని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని స్థానిక మహాలింగేశ్వర గార్డెన్‌లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ బ్లాక్‌కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, కొంత ఇబ్బంది ఉన్న మాటను తెలంగాణ ప్రజలకు తెలియాలని వివరించామన్నారు. క్షేత్రస్థాయి లో పార్టీ స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని తె లంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పార్టీ కార్యక్రమా లను నిర్వహిస్తున్నారన్నారు. ఎవరైతే గ్రామ కాంగ్రెస్‌ పార్టీని నడపగలుగుతారో వారినే గ్రామశాఖ అధ్యక్షుడి గా ఎన్నుకోవాలని, మండల అధ్యక్షులుగా సమష్టి నిర్ణ యం తీసుకోవాలని సూచించారు. కార్యకర్తల అందరి కృషితో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకుపోవాలని అన్ని ఎన్నికల్లో పార్టీ గెలిచేలా బాధ్యత కార్యకర్తలు తీసుకో వాలన్నారు. ప్రతి పథకం పేదవాడికి అందేలాగా చేస్తు న్నామని, ఇందిరా సౌర, గిరి జల వికాసం పథకం సోమవారం ప్రారంభించామన్నారు. సోలార్‌ ద్వారా మోటార్‌ సిస్టబ్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల్లో పేదలకు పాదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తు న్నామని, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నా రని ప్రతిపక్షాలను విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట అమ లుచేస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మండలాలు గ్రామాల్లో పార్టీ పునఃనిర్మాణం జరగాలని, అనుబంధ సంఘాలు, యువజన సంఘాలు బలోపే తం కావాలని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందకు అహ ర్నిశలు కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. నియోజకవర్గ బ్లాక్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల విస్తృ త స్థాయి సమావేశానికి హజరైన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పో తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రా జన్న ఆలయ అభివృద్ధి విస్తరణచేస్తూ మందుకు పోతున్నామని, ప్రజా ప్రభు త్వంలో ఆలయ అభివృద్ధి, పట్టణ అభి వృద్దికి కృషి చేస్తున్నామన్నారు. ఆల య అభివృద్దిలో భాగంగా స్వామి వారికి జరిగే సుప్రభాత సేవ నుంచి మొదలుకుని రాత్రి వరకు జరిగే అన్ని నిత్య పూజలు యాదావిధిగా జరుగు తాయని తెలిపారు. దేవాలయం మూ సివేత అనేది ఉండదని, ఏవాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయ ని, అభివృద్ధిలో భాగంగా మండపాన్ని విస్తరిస్తూ పను లు సాగిస్తామని, ఈనేపథ్యంలో విస్తరణ సమయంలో పలంచా కట్టెలుంటాయని, స్లాబ్‌లు వేస్తారని భక్తుల ఇబ్బందులు పడితే నిర్మాణ పనులు ఎలా చేస్తారని వివరించారు. భక్తులకు ఆర్జిత సేవలు దూరం చేయ కుండా ఉండేందుకు శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు భీవేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు ఏ ర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తుల సంఖ్య పెరు గుతున్న నేపథ్యంలో అభివృద్ది చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి రూ.76 కోట్లతో విస్తరణ చేయాలని నిర్ణయించాలన్నారు. ప్రజలు చెప్పే ప్రతి విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరు చెప్పిన పాజిటి వ్‌ కోణంలో తీసుకుని రాజన్న ఆలయ అభివృద్ది, విస్తర ణ ముందకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో పట్టణ, ఆయామండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:41 AM