ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం

ABN, Publish Date - May 10 , 2025 | 11:29 PM

కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ గౌస్‌ ఆలం పోలీసు అకారులకు ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీ గౌస్‌ ఆలం

- సీపీ గౌస్‌ఆలం

కరీంనగర్‌ క్రైం, మే 10 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ గౌస్‌ ఆలం పోలీసు అకారులకు ఆదేశించారు. శనివారం నగరంలోని రెండో ఠాణాలో టౌన్‌, డివిజన్‌ పోలీసు అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, మార్కెట్‌ ప్రాంతాల వంటి రద్దీ ప్రదేశాల్లో విసిబుల్‌ పోలీసింగ్‌ కార్యక్రమాలు పెంచాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్ల వద్ద స్టాటిక్‌ పికెట్స్‌తోపాటు పలుచోట్ల వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వేలిముద్రలు సేకరించాలని అన్నారు. ఈ తనిఖీల్లో పోలీసులతోపాటు డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల్లో పోర్టబుల్‌ ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌లను వినియోగించాలన్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా సంచరించే బస్టాండ్లు, ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటును క్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. నిరంతర పెట్రోలింగ్‌, వాహన తనిఖీలు నిర్వహించాలని, సోషల్‌ ఎలిమెంట్స్‌, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువుల గురించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, సూచనలు ఇవ్వాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 100కు కాల్‌ చేయాలని ప్రజలకు సూచించాలని కోరారు. ముఖ్యమైన, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని, సోషల్‌ మీడియాపై నిరంతర నిఘా ఉంచడం అవసరమని సీపీ స్పష్టం చేశారు. సమావేశంలో టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్ల కోటేశ్వర్‌, కె సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:29 PM